అపూర్వ సమ్మేళనం.
సరస్వతీ విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమేళ్ళనం.,
సూర్యాపేట 22 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని బాలాజీ గ్రాండ్ హోటల్ లో సరస్వతి విద్యాలయ ఉన్నత పాఠశాల 2001 -02 పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్నేహితుల కలయిక మధురం అయితే ఆత్మీయ పలకరింపు సుమనోహరం అనుకునే విధంగా విద్యార్థులు ఒకరినొకరు పలకరించుకొని పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. 33 సంవత్సరాల తర్వాత స్నేహితులు ఒకరికొకరు కలుసుకోవడంతో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వయస్సును మరిచిపోయి ఆనందోత్సవాల మధ్య నృత్యాలు చేసుకుంటూ పాత జ్ఞాపకాలు నెమరేసుక్కున్నారు. అనంతరం తమకు విద్యాబోధన నేర్పి ఉన్నత స్థితికి పాటుపడిన గురువులను పూజించుకొని శాలువాలతో మెమొంటోలతో సన్మానించారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ బాల్య విద్యాభ్యాసం ఎంతో విలువైందని దాన్ని సక్రమమైన మార్గంలో నడిపినట్లయితే భవిష్యత్తు అంతా ఉన్నతంగా ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో గురువులు బ్రహ్మయ్య గురూజీ, మధుసూదన్ రెడ్డి ,శేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లక్ష్మి కాంత్ రెడ్డి, లచ్చిరెడ్డి, మురళీకృష్ణ ,విక్రమ్ రెడ్డి, అశోక్ రెడ్డి ,భాను ,వెంకన్న, సైదులు తో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.