డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన..ఆత్మకూరు ఎస్సై శ్రీకాంత్ గౌడ్

Jun 23, 2025 - 21:05
 0  7
డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన..ఆత్మకూరు  ఎస్సై శ్రీకాంత్ గౌడ్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన. విద్యార్థులు డ్రగ్స్ ధూమపానం మత్తు పదార్థాలు మద్యానికి దూరంగా ఉండాలని ఎస్సై శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాలు వలన దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఫ్యాషన్ మోజులో సిగరేటు మందు గంజాయి ఆల్కహాల్ కు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ వీరారెడ్డి, రమేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.