పీ వీ నరసింహారావు  వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎర్రవల్లి మండల కాంగ్రెస్ నాయకులు

Dec 23, 2024 - 17:53
 0  1
పీ వీ నరసింహారావు  వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎర్రవల్లి మండల కాంగ్రెస్ నాయకులు
పీ వీ నరసింహారావు  వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎర్రవల్లి మండల కాంగ్రెస్ నాయకులు

జోగులాంబ గద్వాల 23 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి  మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్  మాట్లాడుతూ భారత రాజకీయాలలో అపరచానికుడు అనే పేరు గాంధీ నెహ్రూ కుటుంబాలకు చెందిన తొలి కాంగ్రెస్ నేతగా ప్రధాని పదవి కాలాన్ని పూర్తిచేసిన అరుదైన ప్రతిష్ట మైనారిటీ ప్రభుత్వాన్ని నిలకడగా నిబ్బరంగా ఐదేళ్లు నడిపించిన తెలుగు నేతృత్వం ఇవన్నీ తలుచుకోగానే గుర్తుకు వచ్చే పేరు పాములపర్తి వెంకట నరసింహారావు  సీతారామారావు రుక్మాబాయమ్మ పుణ్య దంపతులకు 28 జూన్ 1921న జన్మించారు వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రత్న బాయిలు పి వీ ని దత్తత తీసుకున్నారు. ఈ విధంగా దేశ పితాని కోరిన మహామనిషి స్థిత ప్రజ్ఞుడు సంక్షోభ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను అడ్డుకు చేర్చిన అసమాన్యుడు తనవారినే కాదు రాష్ట్రాన్ని దేశాన్ని దుఃఖ సాగరంలో ముంచి డిసెంబర్ 23వ తేదీన 2004 సంవత్సరమున గుండెపోతుతో కన్నుమూశారు... స్థిత ప్రజ్ఞుడు , సంస్కరణశీలి , అపరచానికుడు న్యాయ శాస్త్రజ్ఞుడు బహుభాష కోవిదుడు అందరికీ అయిన వాడు మన తెలంగాణ మహనీయుడు సాహిత్య సుగందాలకు వెదజల్లిన వాడు లోపలి మనిషిని అందంగా ఆవిష్కరించిన వాడు ఎదిగిన కొద్ది ఒదిగి ఉండడం మెట్లగో తెలిసినవాడు దక్షిణ భారత నుండి మొట్టమొదటగా ప్రధాని పీఠం అదృష్టంచిన వాడు ఆయనే పీ వీ నరసింహారావు  ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకున్నారు ...ఈ కార్యక్రమంలో అలంపూర్ తాలూకా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జోగుల రవి , మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రుక్మానందరెడ్డి , భాస్కర్ రెడ్డి , వెంకటన్న అల్లబకాస్ , బజారి , రాజ్ కుమార్ , శాంతన్న , ఎం వెంకటేష్ , బలరాం , నారాయణ , రాముడు , ఈదన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని నివాళులర్పించడం జరిగినది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333