రైతుబంధు రాకుండ చేసిన అధికారులు.. నారాయణదాసు వెంకన్న ఆవేదన
తుంగతుర్తి ఫిబ్రవరి 3 తెలంగాణ వార్త ప్రతినిధి
తుంగతుర్తి మండలానికి చెందిన నారాయణదాసు వెంకన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం నా భూమి 20 గుంటలు ఉండగా నాకు పాస్ బుక్ కూడా ఉన్నది అట్టి భూమిపై నాకు రైతుబంధు గతంలో డబ్బులు వచ్చినాయి. గత రెండు సంవత్సరాల నుండి ఈ పాస్ బుక్ పై నాకు 20 గుంటల భూమి ఉన్నది ఈ భూమి మా తాతలనాడు నుండి మా నాన్న నుండి నాకు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎవరో ఆన్లైన్లో నా భూమిని ఎమ్మార్వో ఆఫీసులో నా పేరును తీసివేసి వేరే వారి పేరు ఎక్కివ్వడంతో నాకు రైతుబంధు రాకపోవడం తో నేను గత ఆరు నెలల నుండి ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ నాకు కొత్త పాసుబుక్ ఉన్నప్పటికీ నాకు 20 గుంటల భూమి రైతుబంధు ఇవ్వకపోవడంతో నేను గత ఆరు నెలల నుండి ఆఫీస్ చుట్టూ తిరిగినప్పటికీ తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టించుకోకపోవడంతో నాకు న్యాయం చేయాలని పత్రికల వారిని సంప్రదించడం జరిగింది. కావున నాయందు దయ ఉంచి నాకు తక్షణమే తాసిల్దార్ కార్యాలయంలో నా సర్వే నంబర్ పై ఉన్న వేరే రైతు పేరును తొలగించి నా పేరును ఎక్కియాలని కోరుతున్నాను నాకు రైతుబంధు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని తాసిల్దార్ కార్యాలయ సిబ్బందిని కోరడం జరుగుతున్నది లేనియెడల నేను తాసిల్దార్ కార్యాలయం ముందు పురుగుమందు తాగడం జరుగుతుంది కావున నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.