సబ్సిడీ మినుముల ప్యాకెట్లు పంపిణీ

Aug 25, 2026 - 21:14
Aug 25, 2026 - 23:56
 0  12
సబ్సిడీ మినుముల ప్యాకెట్లు పంపిణీ

తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని రైతు వేదికలో సబ్సిడీ మినుములు రైతులకు అందించడం జరిగినది

తిరుమలగిరి 26 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ సబ్సిడీ లో మినుములు తొండ రైతు వేదికలో అందుబాటులో ఉన్నాయి కావలసిన రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకొని తొండ రైతు వేదిక లొ నాలుగు కేజీల మినుములు పెద్ద ప్యాకెట్ ధర 528 రూపాయలు కాగా సబ్సిడీ 240 రూపాయలు సబ్సిడీ పొంది రైతు 288 రూపాయలు మాత్రమే చెల్లించాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు వ్యవసాయ విస్తరణ అధికారి మహిత డిసిఎస్ వాలంటీర్లు మరియు రైతులు పాల్గొన్నారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి