జనాభా లెక్కలలో 21 రకాల వైకల్యాలను గుర్తించాలి
భువనగిరి 29 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- జిల్లాలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుర్పంగ ప్రకాష్ వనం ఉపేందర్ డిమాండ్.ఎన్ పి ఆర్ డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా.అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం సమర్పణ.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్వరూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే జనాభా లెక్కల యందు 21రకాల వైకల్యాలను గుర్తించకుండా కేవలం తొమ్మిది రకాల వైకల్యాలు గుర్తించడం వికలాంగులను మోసం చేయడమేనని వారు సందర్భంగా గుర్తు చేశారు.అదేవిధంగా జిల్లా ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న ఒక్క బ్యాక్లాగ్ పోస్టు కూడా నింపకపోవడం వికలాంగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బయటపడుతుందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత జిల్లా నాయకులు మధిర పద్మ శ్యాంసుందర్ వెంకటేష్ గోపి నాగు నరసింహ రేణుక హరిబాబు గిరి తదితరులు పాల్గొన్నారు.