ఆర్టీసీ బస్సు 'ఢీ' మహిళా మృతి
ఆర్టీసీ బస్సు "ఢీ" కొట్టగా మహిళ మృతి..
04-10-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన లక్ష్మి పల్లి స్టేజ్ దగ్గర పెబ్బేరు నుండి చిన్నంబావి లక్షింపల్లి స్టేజి ద్వారా కొల్లాపూర్ కు ఆదివారం మధ్యాహ్నం వస్తున్న కొల్లాపూర్ ఆర్టీసీ డిపోబస్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న మహిళా ప్రయాణికురాలిని ఢీ కొట్టగా లక్షింపల్లి స్టేజ్ దగ్గర సుజాతమ్మ 48(భర్త ఈశ్వర గౌడ్) అక్కడికక్కడే మృతి చెందినది.
ఈ ప్రమాదం నుండి మరో ఇద్దరు మహిళా ప్రయాణికులు తప్పించుకున్నారు.
పెబ్బేరు నుండి చిన్నంబావి లక్ష్మీపల్లి స్టేజి ద్వారా కొల్లాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి లక్ష్మి పల్లి స్టేజి దగ్గర ఉన్న మహిళా ప్రయాణికులు బస్సు ఎక్కడానికి డ్రైవర్ కు కుడి వైపు నుండి ఎడమవైపు వచ్చి ఎక్కేందుకు ప్రయత్నం చేస్తుండగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వలన ఆర్టీసీ బస్సులలో కెపాసిటీకి మించి మహిళా ప్రయాణికులు ఎక్కుతున్నారని డ్రైవర్ లక్ష్మి పల్లి స్టేజి దగ్గర బస్సును ఆపకుండా వేగము గా ముందుకు తీసుకు వెళుతున్న క్రమం లో ఈ ప్రమాదం జరిగినట్లు బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేసి ప్రమాదం నుండి తప్పించుకున్న మహిళా ప్రయాణికులు తెలియజేశారు.
బస్సు ఢీ కొట్టగా సుజాతమ్మ మృతి చెందగా ఆమె భర్త బస్సు ముందర నిలబడి బోరున విలపించారు.
సంఘటన విషయం తెలిసిన వెంటనే చిన్నంబావి మండల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
కొల్లాపూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ నీలా మణి వచ్చి చనిపోయిన సుజాతమ్మ ను పరిశీలించి
ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై తగిన చర్యలు మృతి చెందిన సుజాతమ్మ మృత దేహం ను సంఘటన స్థలం నుండి తొలగించమని సుజాతమ్మ బంధువులు తోటి ప్రయాణికులు ఆందోళనకు దిగడం తో సుజాతమ్మ మృతదేహం ప్రమాదం జరిగిన బస్సు ముందర అలాగే పడి ఉన్నది.