జిఎం పిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కడెం లింగయ్య

Aug 25, 2026 - 21:17
Aug 25, 2026 - 21:21
 0  3
జిఎం పిఎస్ రాష్ట్ర  కమిటీ సభ్యుడిగా కడెం లింగయ్య

  తిరుమలగిరి 26 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

గత పదిహేను సంవత్సరాల నుండి గొర్ల కాపరుల సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించిన ఫలితంగా 

జి ఎం పి ఎస్ చెంగిచెర్ల లో జరిగిన రాష్ట్ర నాలుగో మహాసభల్లో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగినది రెండోసారి నూతన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన కడెం లింగయ్యను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ గొల్ల కురుమలకు వర్తించాలని ఇందిరమ్మ ఇండ్లు ఇంటి స్థలము లేని వారికి స్థలము కొనివ్వాలి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి 

50 సంవత్సరాలు నిండిన యాదవులందరికి నెలకు 5000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ లైఫ్ ప్రిన్సెస్ ప్రమాద బీమా ఠఇవ్వాలి ప్రమాద శాత్తు చనిపోయిన కాపరులందరికి ఎక్స్రియా 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అన్ని గ్రామాలలో సొసైటీ ఎన్నికలు నిర్వహించాలి 

ఖాళీగా ఉన్న వెటనరీ పోస్టులన్నీ భర్తీ చేయాలి యాదవ విద్యార్థులు చదువుకోవటం కోసం ప్రతి జిల్లా ఎడికోటలో కాలేజీలు నిర్మించాలని వీటితోపాటు కాపరులందరికీ గొర్లను మేకలను మేపుకోవడానికి బంజరాయి పోరంబోకు భూములు దేవాలయ భూములు చెరువు శిఖరాలు ప్రభుత్వం కాపర్లకు ఇవ్వాలని నాలుగవ మహాసభల్లో తీర్మానం చేయడం జరిగినది మా సమస్యలన్నిటిని ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే పరిష్కరించాలని కోరారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి