ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

Aug 25, 2026 - 21:10
 0  1
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

  తిరుమలగిరి 26 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామపంచాయతీ పరిధిలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో భాగంగా గ్రామ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ

 సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. గ్రామంలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సూర్యాపేట యాదగిరి, సర్పంచ్ బాషమల్ల స్వాతి, ఎంపీఓ భీమ్ సింగ్, పంచాయతీ కార్యదర్శి యాకూబ్ రెడ్డి, మండల విద్యాధికారి శాంతయ్య, సైదులు, టెక్నికల్ అసిస్టెంట్ రమాదేవి ఎక్సైజ్ కానిస్టేబుల్స్, గౌడ సంఘం అధ్యక్షులు నాగమల్లు ఫీల్డ్ అసిస్టెంట్ గీత మరియు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి