మెడికల్ షాపుల్లో మందుల రేట్లు ఎమ్మార్పీ రేట్ల మీద 30% తగ్గించి అమ్మినా? మెడికల్ షాప్ యజమానులకు లాభదాయకంగానేఉంటుందని ప్రజల అభిప్రాయం
అత్యున్నత న్యాయస్థానం సూచనలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్న ప్రజలు.
తెలంగాణ వార్త సెప్టెంబర్ 29 జిల్లా స్టాపర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా : అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న బడుగు బలహీన వర్గాలు మరియు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కోట్లాది మంది ప్రజలు. వ్యాధుల నివారణ కోసం ఆసుపత్రులకు వెళుతుంటారు.
ఆస్పత్రులకు వెళ్లిన ప్రజలు వైద్యులు సూచించే టెస్టులు చేసుకోవడానికే ముందుగా రోగులుఅధిక నిధులు వెచ్చించాల్సి వస్తోంది.
మెడికల్ టెస్టులకు రుసుము చెల్లించలేక పేషెంట్లు ముందుగానే ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
మెడికల్ టెస్టులు పరిశీలించి డాక్టర్లు సూచిస్తున్న (కాంబినేషన్) మందుల చీటీ పట్టుకొని మెడికల్ షాపులకు వెళితే మందుల రేట్లు చూసి కోర్సుకు తగిన మందులు కొనలేక పేషంట్ల పేరెంట్స్ గుండె గుబెల్ మంటో0ది.
ఆర్థికంగావైద్యం చేయించుకునే శక్తి లేక అప్పో సొప్పో చేసుకొని ఆసుపత్రికి వస్తే రోగానికి తగు మందులు సూచించాల్సిన వైద్యులు ఇందుకు విరుద్ధంగా మెడికల్ షాపులకు లాభం చేకూరే విధంగా కాంబినేషన్ మందులు రిఫర్ చేస్తుండడంతో ఈ మందులకు అధిక రేట్లు చెల్లించలేక రోగులు పలు ఇబ్బందులు పడుతున్నారు.
ఎమ్మార్పీ రేట్లకు 30 శాతం తగ్గించి అమ్మినా మెడికల్ షాప్ యజమానులకు లాభదాయకంగానే ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైన్ షాపుల కంటే మెడికల్ షాపులలోనే అధిక లాభాలు సమకూరుతాయని మేధావు ల,ప్రజలఅభిప్రాయ0.
ఈకారణంగానే అధిక శాతం వైద్యులు తమ ఆస్పటల్స్ వద్ద మెడికల్ షాపులు తమ వారికే అప్పగిస్తుంటారు.
ఎమ్మార్పీ రేట్లపట్ల అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అత్యధిక శాతం ప్రజలకు నిత్యావసరంగా మారిన మెడికల్స్(మందుల) ను అత్యావసర వస్తువుల జాబితాగా గుర్తించి మందుల రేట్లు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందనే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయడం పట్ల కోట్లాదిమంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకుఅనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
ఎండ్