ఎంబీబీఎస్ ద్యార్థి సలీమాను అభినందించిన మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి
03-10-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామం లో పేదింటి కుటుంబంలో జన్మించిన పింజరి పెద్దఖాసీం గారి కుమార్తె సలీమ MBBS లో సీట్ సాధించడం పట్ల గ్రామంలోని మాజీ సర్పంచు చక్రవర్తి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ సలీమాను శాల్వాతో సన్మానించి అభినందించాడు. మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి మాట్లాడుతూ గ్రామంలో సలీమా లాగా విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని, పేదరికం డబ్బు చదువుకు ఆటంకం కాదు అని ప్రతి ఒక్కరూ కూడా సలీమా లాంటి విద్యార్థిని ఆదర్శంగా తీసుకుని అనుకున్న లక్ష్యాన్ని పట్టుదలతో సాధించాలని గ్రామ యువతీ యువకులకు వివరించారు. చక్రవర్తి తో పాటు కొంతమంది గ్రామ యువకులు సలీమాను మరియు ఆమే తల్లిదండ్రులను శాలువాతో సత్కరించడం జరిగింది. మాజీ సర్పంచ్ తో పాటు ఎండీ మక్బూల్ పాషా, అల్లం శివుడు, మొగిలి ఈశ్వర్, విజయ్, రాజు, మోహన్, ఓంపతి తదితరులు పాల్గొన్నారు.