శ్రీనిధి డబ్బులు గోల్ మాల్......ఫోర్జరీ సంతకాలతో నిధులు విత్ డ్రా
శ్రీనిధి ఉపాధి లోన్ గోల్ మాల్ ....
లక్షల రూపాయలు స్వాహా .....
తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామం లో సంఘటన ......
కనకదుర్గ, భువనేశ్వరి వెలుగు మహిళ సంఘ బంధాల పేరిట....
ఫోర్జరీ సంతకాలతో నిధులు డ్రా చేసిన వైనం ...
సంఘ బంధం అధ్యక్షురాలు పేరుకే .......
ఏపీఎం లక్ష్మీ దే పెత్తనం .......
జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు.... ఆర్డీవో కు సిఫారసు చేసిన కలెక్టర్ .....
ఆర్డీవో ఎదుటనే సంఘ బంధాలను దూషించిన ఏపిఎం.....
ఎస్సీ సబ్సిడీ రుణాల పేరిట రెండు లక్షల రూపాయలు స్వాహా.......
మాకు న్యాయం జరగాలంటూ మహిళ సంఘాల ఆవేదన..
శ్రీనిధి నిధులను స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి
ఒక గ్రామంలోనే ఇంత జరిగితే ఇంకా ఎన్ని గ్రామాలలో ఏం జరుగుతుందో..?
తిరుమలగిరి 23 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామం లో కనకదుర్గ, భువనేశ్వరి వెలుగు మహిళ సంఘ బంధాల కు సంబంధించిన నిధులు డ్రా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుమలగిరి మండలం జలాల్ పురం గ్రామానికి చెందిన ముత్తినేని మానస జిల్లా కలెక్టర్ తో పాటు వెలుగు అధికారులకు ఫిర్యాదు చేశారు జలాలుపురంలో పేరుకే సంఘబంధం అధ్యక్షురాలుగా నియామకం చేసినా ఏపీఎం లక్ష్మి, సీసీ నాగయ్య లదే ఇష్టారాజ్యం , సభ్యులకు తెలియకుండా పోర్జరీ సంతకాలు చేయించుకొని ఇష్టానుసారంగా శ్రీనిధి నిధులను డ్రా చేసి తమ సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారు జలాల పురం గ్రామంలో సుమారుగా శ్రీనిధిలో లక్షల రూపాయలను ఇష్టానుసారంగా సభ్యులు తెలియకుండా సొంతంగా వాడుకుంటున్నారు సంఘ బంధం అధ్యక్షరాలు తో పాటు సంఘ రుణాలు తీసుకున్న సభ్యులు ప్రతినెల క్రమం తప్పకుండా చెల్లించినప్పటికీ డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా ఆ గ్రామ వి ఓ ఏ తో పాటు ఏపీఎం లక్ష్మి సీసీ నాగయ్య లు కలిసి తమ ఇష్టానుసారంగా వ్యవ వరిస్తున్నారని ఆరోపించారు, గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ రావలసిన కమిషన్లు కూడా ఇవ్వకుండా ఆ గ్రామ వి ఓ ఏ ఓ భర్త బినామి పేర్లతో కాజేశారని ఆరోపించారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందనలాల్ పవార్ . తో పాటు ఆర్డీవో కు ఫిర్యాదు చేయగా ఆర్డీవో ఎదుటనే సంఘ బంధ సభ్యులను దూషించిన అధికారుల పై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు, తిరుమలగిరి మండల ఏపిఎం లక్ష్మి, ఎస్సీ సబ్సిడీ రుణాల పేరిట రెండు లక్షల రూపాయలు స్వాహా చేసిన దాచేపల్లి అనంతలక్ష్మి. కీ సహకరిస్తూన్నారని తెలిపారు మహిళా సంఘం పేరిట మండలానికి ఫెర్టిలైజర్ దుకాణం మంజూరు కాగా.! ఒకరు పేరిట మరొకరి కేటాయించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు సంబంధిత అధికారులు తాను సంఘ బంధంలో 80,000 వేలకు అప్పు ఉండగా 45 వేల రూపాయలను జమ చేయమని వివో అనంత లక్ష్మికి ఇవ్వగా వారు జమ చేయకుండా వాడుకున్నారని అడగగా ఏం చేసుకుంటావో చేసుకో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో నన్ను ఏం చేయలేవు అధికారులంతా నా వైపే ఉన్నారని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇట్టి విషయం బ్యాంకులో చెక్ చెయ్యగా తెలిసిందనీ అన్నారు మరో సంఘ సభ్యురాలు, గుమ్మడవెల్లి రుక్మిణి 30 వేల రూపాయలను కూడా వాడుకున్నట్లు తెలిపారు,అట్టి విషయం కలెక్టర్ ఫిర్యాదు చేయగా. రెండు రోజుల్లో ఎంక్వయిరీ చేయమని ఆదేశాలు జారీ చేసిన నేటి వరకు ఎలాంటి విచారణ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మానస ఆరోపించారు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత ఫోన్ చేసి బెదిరిస్తుర్రని ఆరోపించారు యదేచ్చగా శ్రీనిధి శ్రీ నిధులతో దాచేపల్లి వెంకన్న ఆధ్వర్యంలో అక్రమాలు చేస్తున్నారని వారు ఆరోపించారు