గ్రామ కార్యదర్శి విధులకు ప్రజాప్రతినిధి భర్త జోక్యమేంటి...?

Oct 1, 2026 - 09:36
 0  90
గ్రామ కార్యదర్శి విధులకు ప్రజాప్రతినిధి భర్త జోక్యమేంటి...?

తిరుమలగిరి 01 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి విధులకు ఓ ప్రజా ప్రతినిధి భర్త నిత్యం అడ్డంకులు కలిగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పరిపాలన అంశాలపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం గతంలో పనిచేసిన కార్యదర్శి సైతం ఆయన ఒత్తిడి కారణంగానే బదిలీ చేయించుకున్నారు అనే ప్రచారం ఉంది  సదరు గ్రామపంచాయతీ కార్యదర్శి ఇట్టి విషయం పై అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేదని సమాచారం ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం సరికాదని గ్రామస్తులు మండిపడుతున్నారు దీనిపై ఎమ్మెల్యే మందుల సామేలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి