ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాలెంల ఉప్పలయ్య
సూర్యాపేట 3 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ప్రగతిశీల తల్లిదండ్రుల (పిపిఎల్)సూర్యాపేట జిల్లా గురుకులాల జిల్లా కమిటీ అధ్యక్షుని నియామకం సూర్యాపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎన్నుకోవడం జరిగింది.రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి రాములు రాష్ట్ర గౌరవ సలహాదారులు మచ్చ నర్సయ్య ఎర్రమల నాగమణి దాసరి శ్రీను వెంకటేష్ మాజీ జిల్లా అధ్యక్షులు బొల్లికొండ వీరస్వామి,శ్రావణపల్లి లలిత, బాలెంల ధనమ్మ,పేరమల్ల సునీత ఆధ్వర్యంలో జిల్లా నూతనంగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది.జిల్లా అధ్యక్షులుగా బాలెంల ఉప్పలయ్యను గౌరవ సలహాదారులుగా ముత్యాల కిషన్, ప్రధాన కార్యదర్శిగా చింతకుంట్ల కనకధారను, ఉపాధ్యక్షులుగా నాగజ్యోతి, గద్దల వీరబాబు,కోటేష్ కోశాధికారిగా నాగయ్య అధికార ప్రతినిధిగా పేరాల వెంకన్న సహాయ కార్యదర్శిగా మామిడి శ్రీను శైలజ మీడియా ఇన్ఛార్జిగా మామిడి కృష్ణను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా బాలెంల ఉప్పలయ్య మాట్లాడుతూ.. తల్లిదండ్రుల సమస్యల పరిష్కారానికి విద్యార్థుల హక్కుల పరిరక్షణకు సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తానని వారు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పి పి ఎల్ రాష్ట్ర జిల్లా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.