గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ టి . శ్రీనివాస్ రావు ఐపీఎస్ .
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
జోగులాంబ గద్వాల 23 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 11 అర్జీలను జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ పరిశీలించారు.
ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతోందని తెలిపారు.
ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో
అక్రమంగా ఇంటిని కూల్చివేయడం గురించి -01
ప్లాట్ కబ్జాకు సంబందించి -01
ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వడం లేదనీ -01
భర్త వేదింపులకు సంబందించి -01
కుటుంబ తగాదాలకు సంబందించి -02
ఇతర అంశాలకు సంబంధించి -03 ఫిర్యాదులు రావడం జరిగిందని పి ఆర్ ఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు.