కేంద్రం ప్రభుత్వం వల్లనే తెలంగాణలో యూరియా కొరత
నిమ్మల సంతోష్ గౌడ్ మండల కాంగ్రెస్ నాయకులు

అడ్డగూడూరు 21 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఇవ్వకుండా కుట్ర చేస్తూ కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంన్ని ఇబ్బందులకు గురి చేయడమే కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అడ్డగూడూరు మండల కాంగ్రెస్ నాయకులు నిమ్మల సంతోష్ గౌడ్ ఆరోపించారు.గురువారం ఆయన అడ్డగూడూరు మండల కేంద్రంలో విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన బిజెపి పార్టీ ఎంపీలు,ఇద్దరు కేంద్ర మంత్రులు,ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ రైతులు యూరియా కోసం హరిగోసలు పడుతుంటే మీ కండ్లకు కనబడడం లేదా..?? అని ప్రశ్నించారు.మంగళవారం పార్లమెంట్ ఆవరణంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా,ఆందోళన చేస్తేనే 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తక్షణమే సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వెంటనే తెలంగాణకు యూరియా కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని నిమ్మల సంతోష్ గౌడ్ డిమాండ్ చేశారు.