పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

Sep 27, 2026 - 08:00
 0  4
పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

తిరుమలగిరి 27 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మండలంలోని చౌల తండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కైనీరుస హాజరై మాట్లాడుతూ పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో కీలకమని, పిల్లలకు రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వయస్సుకు తగిన ఆహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.గర్భిణీలు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధరావత్ సుజాత ఉపాధ్యాయులు నాగేష్ అంగన్వాడి టీచర్ భవాని అమల గర్భిణీలు బాలింతలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి