చెరువు కట్ట నిర్మాణంలో భారీ అవినీతి

Sep 28, 2026 - 07:49
 0  109
చెరువు కట్ట నిర్మాణంలో భారీ అవినీతి

 తిరుమలగిరి 28 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి పెద్ద చెరువు కట్ట నాణ్యత ప్రమాణాలను పాటించకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి 

  పెద్ద చెరువు కట్ట అమృత్ 2.0 పథకం ఈ పథకం మూడుకోట్ల 20 లక్షల రూపాయలు పెద్ద చెరువు కట్ట నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించడం జరిగింది 

పెద్ద చెరువు కట్ట కాంట్రాక్టర్ కనీస నాణ్యత ప్రమాణాలను పాటించకుండా ఆయనకు ఇష్టం వచ్చిన రీతిలో కట్ట వర్క్ చేసినాడు పనిలో నాణ్యత లేదని జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య గతంలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయిన నిమ్మకు నీరెత్తినట్టేనా లేదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలన చేసి కాంటాక్ట్ ను రద్దుచేసి బిల్లులను నిలిపివేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది కాంట్రాక్టర్ కనీస నాణ్యత ప్రమాణాలను పాటించకుండా వారికి ఇష్టమొచ్చిన రీతిలో కట్ట వర్క్ చేసినాడు పాత కట్టను బ్లౌజ్ నున్నగా చేసి బిల్లును ఎత్తుకున్నాడు మట్టి పోసి రూలర్తో తొక్కించలేదు కట్ట సైడు సోలింగ్ గ్రానైట్ పరిచి సిమెంటు కూడావేయలేదు అక్కడ ఉన్నాం మట్టిని మాత్రమే డోజర్లతో నున్నగా చేసినారు చేసి బిల్లులు ఎత్తుకుంటున్నాడు 

ఆ వర్క్ లో కనీస నాణ్యత లేదని తిరుమలగిరి పెద్ద చెరువు కట్ట కింద ఉన్న రైతులు అధికారుల దృష్టికి తీసుకు పోవడం జరిగింది 

అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద చెరువు కట్ట పరిశీలన చేయడం జరిగినదిచెరువు కట్ట నాణ్యత పాటించకుండా కాంట్రాక్టర్ దారుడు వర్క్ చేస్తున్నాడని తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్ కు తహసిల్దార్ కు మరియు సంబంధిత ఏఈ జేఈఈ వీరందరికీ లెటర్ ల ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టైనా లేదు 

పెద్ద చెరువు కట్ట కాంట్రాక్టర్ దారి మరియు సంబంధిత అధికారులు వీరందరూ కుమ్మక్కై ఆ పైసలను వాటాల వారీగా పంచుకున్నారే తప్ప పనిని మాత్రము పరిశీలించలేదు ఏమాత్రము నాణ్యత ప్రమాణం పాటించకుండా పెద్ద చెరువు కట్ట వర్క్ చేసిన కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్య తీసుకుని అట్టి బిల్లులను నిలిపివేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కాంట్రాక్టర్ దారిపై తక్షణమే మీరు చర్య తీసుకోకపోతే ఆ ప్రాంతంలో ఉన్న రైతులను సమీకరించి వర్కులు నిలిపివేస్తామని సిపిఎం పార్టీ తరపున అధికారులను కోరారు 

ఈ కార్యక్రమంలో బేతు సాంబయ్య పులిమామిడి భిక్షము కళ్యాలకు వీరన్న రైమన్ వీరయ్య శీను కొమురెల్లి తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి