అంధకారంలో ఆదర్శ కాలనీ పట్టించుకోని అధికారులు

Sep 28, 2026 - 07:47
 0  27
అంధకారంలో ఆదర్శ కాలనీ పట్టించుకోని అధికారులు

   తిరుమలగిరి 28 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ 

  తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని 3 , 4 వ వార్డు ఆదర్శ కాలనీ ఆవరణలో గల విద్యుత్ స్తంభాలు రాత్రి వేళలో విద్యుత్ కాంతులు విరజిమ్మక. ఆ కాలనీ ప్రాంతంలో చీకటి ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా మున్సిపల్ సిబ్బంది పొరపాటా.. ఏది ఏమో గాని కాలనీ వాసుల కష్టాలు మాత్రం వర్ణనాతీతం. తక్షణమే విద్యుత్ స్తంభాలకు విద్యుత్ కాంతులు ప్రకాశింప చేయాలని అలాగే రాత్రివేళ వీధి దీపాలు పక్కాగా పనిచేయడంతో పాటు పగటి పూట వెలగకుండా చర్యలు తీసుకుని విద్యుత్ వృధాను అరికట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి