క్రాంతికుమార్ కు డాక్టరేట్
సూర్యాపేట, 31 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేటకి చెందిన పులిపాటి క్రాంతి కుమార్ కి అరుదైన గౌరవం దక్కింది. జువాలాజీ (జంతు శాస్త్రం) లో పిహెచ్. డి ప్రధానం చేసినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ కృష్ణంరాజు తెలిపారు. క్రాంతికుమార్ జంతు శాస్త్రంలో "టెర్మీటిసైడల్ అండ్ బయో కెమికల్ ఆక్టివిటీ ఆఫ్ టెర్పినాయిడ్స్ అండ్ ఆల్కలాయిడ్స్ ఆన్ ఇండియన్ వైట్ టెర్మిట్ ఓడొంటోటర్మెస్ ఓబెసస్: ఇన్ విట్రో, ఇన్ వైవో అండ్ మెకనిస్టిక్ ప్రాపర్టీస్" అనే అంశం మీద డాక్టర్ ఆప్కా నాగేశ్వరరావు పర్యవేక్షణలో సిద్ధాంత గ్రంథం సమర్పించారు. సూర్యాపేట, ఆర్.కె గార్డెన్ కు చెందిన పులిపాటి క్రాంతి కుమార్ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి, సూర్యాపేటలో పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి పీజీ ని ఉస్మానియా విశ్వ విద్యాలయం ద్వారా పూర్తి చేశాడు. ప్రస్తుతం అనాజీపురం లోని ఆదర్శ పాఠశాలలో పిజిటి జువాలాజీ ఉపాధ్యాయునిగా మరియు బయాలజీ జిల్లా రిసొర్స్ పర్సన్ గా విధులు నిర్వహిస్తున్నారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ కోడి లింగయ్య మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు అభినందించారు.