నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

Aug 4, 2026 - 21:41
 0  3
నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

  తిరుమలగిరి 05 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి  మండల కేంద్రంలో విద్యాశాఖ అనుమతులు లేకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి శాంతయ్యకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా కడెం లింగయ్య మాట్లాడుతూ తిరుమలగిరిలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ అనుమతులకు విరుద్ధంగా నడుస్తూ విద్యను వ్యాపారంగా మార్చేశాయని విమర్శించారు అధికారిక పుస్తకాలను పక్కనపెట్టి కమీషన్ల కోసం ప్రైవేట్ పబ్లిషన్ పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని తెలిపారు పాఠశాలలో సురక్షితమైన త్రాగునీరు తగినంత వెలుతురు ఫైర్ సేఫ్టీ అగ్నిమాపక భద్రత లేవని అన్నారు సమగ్ర విచారణకు ఆదేశించి విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రైవేటు ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోసిఐటియు తిరుమలగిరి మండల కార్యదర్శి పానుగంటి శ్రీనివాస్ సిపిఎం పార్టీ నాయకులు పులిమామిడి బిక్షం పడమటింటి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి