వ్యవస్థాగత లోపాలు,  రైతుల పట్ల  ప్రభుత్వాల నిర్లక్ష్యం,

May 25, 2025 - 23:10
May 29, 2025 - 18:30
 0  5

వ్యవస్థాగత లోపాలు,  రైతుల పట్ల  ప్రభుత్వాల నిర్లక్ష్యం,  వ్యవసాయం పైన సాచివేత వైఖరి కారణంగా  సేద్యం కడగండ్ల మధ్యన  కన్నీరు పెడుతున్నది.*  అప్పుడప్పుడు పండించిన పంటకు రైతులే నిప్పు పెడుతున్నారంటే  వారిలో ఎంత ఆందోళన, ఆవేదన  దాగి ఉన్నదో కదా.*!

వడ్డేపల్లి మల్లేశం
16,  డిసెంబర్ 2024
  అర్థ శతాబ్దానికి పూర్వం   ఆనాటి అరకొర సౌకర్యాలు నీటి సౌకర్యాల లేమి   వలన వ్యవసాయం పట్ల రైతులు అంతగా ఆసక్తి చూపే వాళ్ళు కాదు. అందుకే  నా భూమి కావాలా నీకు తీసుకో  అని సరదాగా మాట్లాడేవారు.  కానీ ప్రస్తుతం  కష్టాలు కడగండ్లు రైతులు ఎదుర్కొంటున్నప్పటికీ  భూముల ధరలకు రెక్కలు రావడంతో  భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతన్నలు  కష్టనష్టాలు లేని సేద్యం కోసం డిమాండ్ చేస్తున్నారు  ప్రభుత్వం దృష్టిని ఆకర్షిస్తున్నారు.  ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం  సమస్యలు,  పాలకుల  బాధ్యతారాహిత్యం,  చేపట్టవలసిన చర్లపైన  నిర్మొహమాటంగా చర్చించాల్సిన అవసరం ఉన్నది  కాలయాపన చేసిన  మొహమాట పడిన  మనలాంటి వాళ్లకు ఇబ్బంది లేదు కానీ  ఆరుగాలం పంటనే నమ్ముకుని  భూమిలో  తమ భవిష్యత్తును నింపుకొని  ప్రకృతి విపత్తుల సమయంలో కన్నీరు పెడుతున్న  రైతన్నల గూర్చి మాత్రం  సమాజం సీరియస్ గా చర్చించవలసిందే  వాళ్ళ కష్టాలను  కొంతవరకైనా శాస్వతంగా  నిర్మూలించవలసినదే.
     నమ్ముకున్న వాడు ఎన్నడూ చెడిపోడు అని  ఒకప్పుడు భరోసాగా ఉండేది కానీ  సాగు ఖర్చులు  పెరిగిన కొద్దీ చీడపీడలు ప్రకృతి విధ్వంసం కారణంగా  ప్రతిఫలం  లభించని దయనీయ  పరిస్థితిలో  అన్నదాతల ముఖంలో కన్నీరు తప్ప  ఏమీ కనిపించడం లేదు అని  సమాజం నమ్మాలి వాళ్ల పట్ల  విశ్వాసాన్ని ప్రకటించాలి కూడా.  ఇప్పటికీ భారతదేశంలో చట్టబద్ధత కలిగిన  శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయించబడిన మద్దతు ధరలు  లేకపోవడం అరకొ  రగా అప్పటికప్పుడు ప్రకటించి  అమలు చేయని కారణంగా ప్రైవేటు పెట్టుబడిదారులు రైతులను  దగా చేస్తున్న సందర్భాలను మనం గమనించవచ్చు.  అందుకే గత రెండు మూడు సంవత్సరాలుగా  పంజాబ్ హర్యానాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది రైతులు  స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, ముఖ్యంగా మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని చేసిన డిమాండ్  ప్రభుత్వాలు తీర్చకపోగా రైతుల పైన  ఉక్కు  పాదం మోపిన సంగతి మన అందరికీ తెలిసిందే. 
ఈ పరిస్థితులలో  నష్టాన్ని భరించలేక అ సంఘటిత రంగంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగం  సంఘర్షణకు గురై అప్పుల పాలై ఆత్మహత్య బారిన పడుతున్న సంగతి మనకు తెలుసు. ఈ రకంగా ఎంతో విలువైన మానవ వనరులను అన్నదాతలను కోల్పోవడం భావ్యమేనా?
       

కొన్ని కీలక  గణాంకాలు వాస్తవాలను పరిశీలిద్దాం:- అన్నదాతల ఆక్రందనలు అరణ్య రోదనగా  మారుతున్న వేళ  తమ బతుకు ను బాగు చేయాలంటూ ఏండ్ల తరబడిగా పాలకులను కోరుచున్నా  కనీసమైన మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించలేని దయనీయ స్థితి ఈనాడు కేంద్ర రాష్ట్ర పాలకులది. కనీస మద్దతు ధరకు  చట్టబద్ధత కల్పించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం ఇటీవల కాలంలో సిఫార్సు చేసిన విషయాన్ని  గమనించాలి.  తద్వారా రైతుల కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచడంతోపాటు  అప్పుల ఊబిలో నుండి కాపాడాలని  అది సూచించినప్పటికీ  ప్రభుత్వాలు ఎంతవరకు స్పందిస్తాయి అనేది వేచి చూస్తే కానీ అర్థం కాదు.  ఇటీవల  నాబార్డు నిర్వహించిన సర్వే ప్రకారం గా  గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబాల సగటు నెలవారి ఆదాయము 13,661 అని   తేలింది అయితే ఆయా కుటుంబాలు  అదనంగా నిర్వహించుకునే పాడి, కోళ్లు, గొర్ల పెంపకం వంటి వాటితో కలుపుకున్నప్పుడు  ఆ మాత్రం ఆదాయం రావడం వ్యవసాయంతోనే అని చెప్పడానికి అంత పెద్ద ఆధారాలు లేవు.  అలాంటప్పుడు ఇక వ్యవసాయంతో  లాభం లేదని అనేకమంది రైతు కుటుంబాల వాళ్లు కూడా ముఖ్యంగా నేటి యువతరం సాగుకు దూరం కావడంతో పాటు ఈ సంక్షోభ  పరిస్థితుల నుండి గట్టెక్కడానికి  పట్టణాలకు వలస పోతూ  పట్టణ వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తున్న తరుణంలో ఎవరికి అందని  ద్రాక్షగా పట్టణ జీవితం మిగిలిపోయింది.  భూమి విలువతో పాటు అన్నిరకాల ఖర్చులను పెట్టుబడులను లెక్కించి ఆ మొత్తానికి 50 శాతం అదనంగా కలిపి రైతులకు మద్దతు ధర ఇవ్వాలన్నది స్వామినాథన్ కమిషన్ సిఫారసు. కాని దాన్ని పట్టించుకున్న పాలకులు లేని కారణంగా ఇటీవల గత నాలుగైదు సంవత్సరాలుగా రైతులు కేంద్ర ప్రభుత్వం పైన  ఒత్తిడి చేస్తున్నప్పటికీ  వారి ఆవేదనను ఆలకించే బదులు
  రబ్బర్ బుల్లెట్లు,  రోడ్ల మీద మేకులతో సమాధానం చెప్పిన ప్రభుత్వ  చరిత్ర  సమాజం సిగ్గుతో తలవంచుకునేది కాదా.
  వంటలు విపరీతంగా పండినప్పుడు ధరలు  పడిపోయి రైతులు నష్టపోతున్నారు  ఇక అవకాశం ఉన్నప్పుడు  కొనుగోలు చేసేవాళ్లు సమయస్ఫూర్తిగా  నటించి  రైతులు అనివార్యంగా అమ్మే దా క వేచి చూడడం వలన కూడా రైతులు అనేక రకాల నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా 70 రకాల పైగా పంటల సాగుకు ఈ దేశంలో వీలున్నప్పటికీ 85 శాతం భూములలో 20 రకాలనే పండిస్తున్నారు అంటే  లాభసాటి అయిన అనేక రకాల పంటలను పండించడంలో రైతులు విఫలం చెందిన లేదా ప్రోత్సాహం లేకపోవడం  ప్రభుత్వ యొక్క నిర్లక్ష్యం కారణంగా  అత్యధికంగా వినియోగించగలిగి  గణనీయంగా గిట్టుబాటు అయ్యే పంటలు పండించకపోవడం అనేది ఒక శాస్త్రీయంగా జరుగుతున్నటువంటి  దోపిడీగా భావించాలి.
       

కష్టాల సేద్యము నుండి బయటపడడం ఎలా:- సన్న వరి రకాలతో పాటు  అన్ని రకాల పంటలకు కూడా కనీస మద్దతు ధరతో పాటు  బోనస్ చెల్లించడం ద్వారా రైతులను ఆదుకునే అవకాశం ఉంటుంది.  నేలల యొక్క స్వ భావాలు, వాతావరణ పరిస్థితులు, దేశ అవసరాలు, ఎగుమతులు దిగుమతుల  యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని శాస్త్రీయంగా పంటల ప్రణాళికను నిర్ణయించే  క్రమం ఈ  దేశంలో లేకపోవడం వలన  కూడా రైతులు నష్టపోతున్నారు. అలాంటి పరిస్థితులు అత్యవసరమైనటువంటి ఆహార పదార్థాల కోసం ఇతర దేశాల దిగుబడి మీద ఆధారపడగ తప్పడం లేదు. అంటే పరోక్షంగా మనం ఆదాయాన్ని కోల్పోయినట్లే కదా  రైతు కుటుంబాలు పాలకులకు సమస్య కాకూడదంటే,  ఆత్మగౌరవంతో దేశ ప్రజలకుతి oడిపెట్టే రైతన్నలు  ఇబ్బందులకు  గురికాకుండా ఉండాలంటే  పండించే పంటలకు గిట్టుబాటు ధరతో పాటు అన్ని రకాల  రైతును ఆదుకోవడం ఉత్పత్తిలో భాగస్వామి అయ్యే రైతుల పక్షాన నిలవడం చాలా అవసరం.  మనదేశంలో ఉత్పత్తి కానటువంటి  లేదా ఇతర దేశాల పైన ఆధారపడుతున్నటువంటి పంటలను  దేశంలోనే పండించడానికి వీలుగా ప్రభుత్వాలు ప్రణాళికలు నిర్ణయించి  ఇతర దేశాల పైన ఆధారపడి నష్టపోయే బదులు ఆ డబ్బును రైతులకు చెల్లించి బాసటగా నిలవాలి.  ప్రణాళిక లేకుండా ఇష్టం ఉన్నట్టుగా పంట పండించడం వలన  డిమాండ్ లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు కనుక శాస్త్రీయంగా ప్రణాళిక బద్ధంగా ఏ రకమైన పంటలు ఎంత స్థాయిలో పండించాలి అనే  ప్రణాళికను సిద్ధపరచి  రైతులకు సలహా ఇచ్చి ఆ మేరకు పంటలు పండించడం ద్వారా గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది .ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించడం,   ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు    మేలు రకమైన విత్తనాలను పూర్తిస్థాయిలో ఉచితంగా సరఫరా చేయడం,  ఇష్టం ఉన్నట్టు రసానిక పదార్థాలు వాడకుండా రైతుల్లో చైతన్యం తీసుకురావడం,  దళారుల నుండి రైతును కాపాడడం వంటి కీలక నిర్ణయాల ద్వారా  ప్రభుత్వాలు వెన్నుదన్నుగా   ఉంటూ  రుణ సౌకర్యం వ్యవసాయ రంగ పరికరాలను ఉచితంగా నాణ్యమైన స్థాయిలో అందించి నపుడు   కన్నీరు పెట్టే   కర్షకుల కంట  పన్నీరు కురవడానికి ఆస్కారం ఉంటుంది.  ఇది నిజంగా కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు సమాజం కూడా కర్షకులను  కంటికి రెప్పలా కాపాడుకోవడం అవసరం. అది ప్రజల యొక్క సంస్కారం, పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333