వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

Jun 5, 2024 - 20:20
 0  66
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

మానవపాడు. మండలంలోని కోర్విపాడు గ్రామానికి చెందిన ఖాజా హుస్సేన్(49) అదృశ్యమయ్యాడు. ఇట్టి విషయంపై భార్య శంషిన్ బుధవారం కేసు నమోదు చేసినట్లు మండల ఎస్సై చంద్రకాంత్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన విరాల ప్రకారం..ఈ నెల 4వ తేదీన నమాజ్ కి వెళ్తున్నట్లు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు చెప్పి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన ఆచూకీ లభించకపోవడంతో.సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు తమ బంధువులు, తమకు తెలిసిన వారి వద్ద అడిగినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఎవరికైనా ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే  సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలియజేశారు.తన భర్త ఆచూకీ కనిపెట్టాలని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రకాంత్ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333