ప్రతి వ్యక్తికి వ్యాయామం అవసరం
అడ్డగూడూరు 18 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యూత్ & స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఫిట్ అండ్ ఆక్టివ్ తెలంగాణ ర్యాలీ మరియు శారీరక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా అడ్డగూడూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి మొదలై తహసిల్దార్ కార్యాలయం వరకు పలు కార్యాలయం అధికారులు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో పి.దేవేందర్ రావు ఎంపీడీఓ(ఇంచార్జ్) శేషగిరిరావు తహసిల్దార్ ఎస్సై వెంకట్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది.ఈ పంచాయతీ సిబ్బంది,ఈజీఎస్ సిబ్బంది,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.