భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

Jun 6, 2024 - 14:40
Jun 6, 2024 - 14:46
 0  18
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

వరంగల్ 06 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- వరంగల్ లోక్ సభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మొదటి సారిగా వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్"కడియం కావ్య కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనలు అందజేశారు. అనంతరం ఎంపీ డాక్టర్:కడియం కావ్య మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో , ఆయు ఆరోగ్యాలతో ఉండే విధంగా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన తోడ్పాటును అందించాలని అమ్మవారిని వేడుకున్నట్లు వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కడియం కావ్య తెలిపారు.