వై ఆర్ జి కేర్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన

తిరుమలగిరి 07 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని వైఆర్జి కేర్ లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు ఎస్ టి ఐ మరియు టీబి వ్యాధుల నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని హెచ్ఐవి అనేది నాలుగు రకాలుగా వ్యాప్తి చెందుతుందని వివరించారు అవి:1 అరక్షిత లైంగిక సంబంధాల ద్వారా, 2 సూదులు మరియు సిరంజిల ద్వారా ,3 ఒకరుని మరొకరికి రక్త మార్పిడి ద్వారా 4 హెచ్ఐవి సోకిన (గర్భవతి అయిన తల్లి నుండి బిడ్డకు) వ్యాప్తి చెందును అనే వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్ హెచ్ పి మరియు ఏఎన్ఎం మరియు వై ఆర్ జి కేర్ లింక్ వర్కర్ స్కీం జోనల్ సూపర్వైజర్ మరియు గ్రామ లింక్ వర్కర్ గోవర్ధన్ ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు అధికంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.