వికలాంగుడి పై గాలి మిషన్ యూనియన్ దౌర్జన్యం

తిరుమలగిరి 07 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
మనిషి ఒక ఎదుటి మనిషిని కనీసం మానవత్వం చూపలేని రోజులు వచ్చాయి కావచ్చు బహుశా అందులో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వికలాంగులపై గాలి మిషన్ యూనియన్ కలిసి వెలివేసిన ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని చోటుచేసుకుంది ఓ దళిత కుటుంబానికి చెందిన సైదులు గత కొన్ని సంవత్సరాలు నుండి గాలి మిషన్ యూనియన్ లో పంచర్ షాప్ నిర్వహించుకుని తన జీవనాధారం సాగించేవాడు గతంలో సూర్యాపేట జనగాం రోడ్డులో ఓ పంచర్ షాప్ వ్యక్తి దగ్గర పంచర్ షాప్ అడ్డ కొనుగోలు చేసుకుని మోటార్ సైకిళ్లకు పంచర్లు వేస్తూ జీవనం చేసుకుంటున్న సమయంలో గిరాకీ లేని అందున వేరే దగ్గర పంచర్ షాప్ నిర్వహించుకున్నాడు మళ్ళీ తిరిగి తన పాత పంచర్ షాప్ దగ్గరికి వచ్చి ప్రారంభించాడు తదనంతరం గాలి మిషన్ యూనియన్ వారు షాప్ పెట్టకూడదంటూ గత కొన్ని రోజులుగా అతనిపై విమర్శలు చేస్తూ దౌర్జన్యానికి గురి చేస్తున్నారని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు గాలిమినేషన్ యూనియన్ వారికి సమాచారం చేరవేస్తే మా యూనియన్ లో మాట్లాడుకుంటాం అని చెప్పి నేటికీ కూర్చొని మాట్లాడుకోవడం లేదు. పంచర్ షాప్ నిర్వహించుకోవడం లేదు అంటూ వికలాంగుడు సైదులు విలేకరుల సమక్షంలో వాపోయాడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ వికలాంగుడైన నాపై వివక్షతకు గురి చేస్తూ షాప్ నిర్వహించకూడదని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు