వేసిన సీసీ రోడ్లు ధ్వంసం
జోగులాంబ గద్వాల 20 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి మండలం కొంకల ముండ్లదిన్నె గ్రామాల పరిధిలో.. రోడ్డు మార్గాలు భారీ వాహనాలతో నిత్యం.. ఇసుక వాహనాలు తిరుగుతుంటాయి.. వేసిన సిసి రోడ్లు ధ్వంసం అవుతున్నాయి... గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని వాహనదారులు వాపోతున్నారు.. ముండ్లదిన్నె , కొంకల ,తాండ్రపాడు గ్రామాల మధ్య పెద్ద గుంతలు ఏర్పడడంతో రాత్రిపూట వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా ముందస్తుగా అధికారులు స్పందించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.. నూతనంగా ఎన్నికైన గ్రామాల సర్పంచులు... ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను చేరవేసి... రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని గ్రామాల ప్రజలు వాపోతున్నారు...