శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తజన సందోహం
జోగులాంబ గద్వాల 20డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్ ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారికి ముక్కులు తీర్చుకునే భక్తులు సుదూర ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా వచ్చి శనివారం దాసంగాలు సమర్పించుకున్నారు. కొత్త కుండకు తిరునామాలు పెట్టి ఆ కొండలో అన్నం పరమాన్నం వండి స్వామికి నివేదన చేసి కుటుంబ సభ్యులు భుజిస్తారు.ఈ సందర్భంగా దేవాలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిటకిటలాడింది. దేవాలయానికి వచ్చిన భక్తులకు అభిలాష్ ఆధ్వర్యంలో గద్వాల ఎస్వీఎస్ సేవా సంఘం వారి 30 మంది మహిళా వాలంటీర్లు స్వామివారికి సేవలు అందించారు. దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి నేతృత్వంలో భక్తులకు దేవాలయ సిబ్బంది సేవలందించారు. ఈ కార్యక్రమంలో పట్వారి అరవిందరావు, చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.