ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో యువజన కాంగ్రెస్ ముఖ్య పాత్ర

అడ్డగూడూరు మండల యువజన అధ్యక్షులు బైరెడ్డి సందీప్ రెడ్డి

Aug 9, 2025 - 19:01
Aug 9, 2025 - 19:03
 0  73
ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో  యువజన కాంగ్రెస్ ముఖ్య పాత్ర

అడ్డగూడూరు 09 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో యువజన కాంగ్రెస్ పార్టీ ముఖ్యపాత్ర పోషించిందని అడ్డగూడూరు మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి సందీప్ రెడ్డి అని అన్నారు. జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బైరెడ్డి సందీప్ రెడ్డి యువజన కాంగ్రెస్ జండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్ వల్ల ఒక సామాన్య కార్యకర్త కూడా ఎన్నికల ద్వారా జాతీయ స్తాయిలో గుర్తింపు పొందే అవకాశం కేవలం యువజన కాంగ్రెస్ మాత్రమే కల్పిస్తుంది అనిఅన్నారు.ప్రభుత్వ ఏర్పాటులో యువజన కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించిందని, కార్యకర్తల కష్టం చాలా ఉంది అని అన్నారు.రానున్న రోజుల్లో అందరికీ సముచిత న్యాయం జరిగేలా పార్టీ నిర్ణయాలు ఉంటాయని ఆయన అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు పెద్ద ఎత్తున టికెట్లు పార్టీ ఇస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లంబట్ల రవీందర్రావు, మాజీ ఎంపిటిసి గూడెపు పాండు, కడారి రమేష్ , మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి చెడె మహేందర్, సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చేడే అంబేద్కర్,సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మారిశెట్టి మల్లేష్,తుంగతుర్తి నియోజవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు పూలపెల్లి రాజశేఖర్ రెడ్డి,ఎలుక సైదులు,మహమ్మద్ షకీల్, ఇలేందర్ యాదవ్,యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిపలుపుల వరుణ్ సుతారపు నరేష్ ,మందుల వెంకటేష్, పయ్యవుల సాయి,నాగులపల్లి శ్రీధర్,నాగులపల్లి మధు, మైనారిటీ సెల్ జిల్లా నాయకులు షేక్ సమీర్ భాయ్,బండి అరుణ్, మైనారిటీ సెల్ నాయకులు మహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.