వారసంతలో ట్రాఫిక్ నిబంధన పాటించాలి ఎస్సై సురేష్
తిరుమలగిరి 05 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
వారసంతలో ఇబ్బందులను పట్టించుకోని మున్సిపల్ అధికారులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
వచ్చే వారసంతలో ట్రాఫిక్ నియమనిబంధన ఏర్పాటు
ప్రజలకు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు
వారసంతలో దొంగలు సంచరిస్తున్నారు జాగ్రత్త ఎస్ఐ సురేష్
తాజా కూరగాయల కొనుగోలులో వారాంతపు సంతలకు ఆదరణ లభిస్తున్నది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో పేరుకు బుధవారం సంతే.. కానీ, అక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. గుండుసూది నుంచి గునపాల వరకు.. పక్కపిన్ను దాకా.. అన్నీ సరసమైన ధరలకు లభిస్తాయి. ఈ సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర మండలాల నుంచి సైతం ప్రజలు పెద్దఎత్తున వస్తుంటారు. వారానికి కావాల్సిన సరుకులు కొని తీసుకెళ్తుంటారు. అటు కొనుగోలుదారులు.. ఇటు వివిధ వస్తువుల విక్రేతలతో చిన్నపాటి జాతరను తలపిస్తుంది. సూర్యాపేట జనగాం రహదారిపై ప్రతి బుధవారం తిరుమలగిరి మున్సిపాలిటీలోని చౌరస్తా వద్ద నుండి సంత జరుగుతోంది. రోడ్డుకు ఇరు వైపుల వ్యాపార, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేస్తుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లపై నిలబడి వినియోగదారులు బేరసారాలు ఆడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ప్రతి వారసంత మధ్యాహ్నం 02 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు జరుగుతుండటంతో ఒకేసారి రోడ్లపై రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని తిరుమలగిరి ఎస్సై సురేష్ తెలిపారు వారసంతలో ట్రాఫిక్ ఇబ్బందులపై వారసంత కాంట్రాక్ట్ లతో మాట్లాడుతూ ప్రతి వారం వారం చిరు వ్యాపారుల వద్ద వసూలు చేసిన డబ్బులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అలాగే ఎలాంటి ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని తెలిపారు వీరితో కానిస్టేబుల్స్ వెంకన్న , నర్సిరెడ్డి, విజయ్ ,శివ, గోపి ,సలీం, వెంట ఉన్నారు