బాల కార్మికుల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం

Sep 10, 2024 - 19:56
 0  5
బాల కార్మికుల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం

జోగులాంబ గద్వాల 10 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాలలో జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఆదేశాలతో డిపిఆర్ఓ రఫీయుద్దీన్ ఆధ్వర్యంలో కళాకారులు పర్యటించి ప్రజలకు అక్షరాస్యత, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక నిర్మూలన, వెట్టి చాకిరి నిర్మూలన తదితర అంశాలపై పాటల రూపంలో గానం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం మల్దకల్ మండల పరిధిలోని విఠలాపురం గ్రామపంచాయతీ ఆవరణలో బాల కార్మిక నిర్మూలన పై పాట రూపంలో పాడుతూ చదువుకుంటేనే భవిష్యత్తు అని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కేశవులు, ప్రసాద్, రమాదేవి, రాహుల్, కృష్ణ, భూపతి, హజ్రత్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333