వెల్దేవి గ్రామపంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసిన కార్యదర్శి మౌనిక రెడ్డి

అడ్డగూడూరు 02 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని వెల్దేవి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆవరణంలో సెక్రెటరీ రచ్చ మౌనిక ఆధ్వర్యంలో జాతీయ జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి పెట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ పిల్లి స్వర్ణలత,టి పి సి సి రాష్ట్ర నాయకులు రాచకొండ సతీష్ గౌడ్,చిలుకూరి తిరుపతయ్య, కుంభం అంజయ్య,చెరుకు కృష్ణ ,కడెం దశరథ,యం నర్సమ్మ, వీఆర్ఏ రాములు ,గ్రామ పంచాయతీ సిబ్బంది చిలుకూరి తిరుమల్లేష్, ఉడుగు రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.