విప్లవ తేజం ఎన్నటికీ అంతరించదు

లాహోర్ కుట్ర కేసు-భగత్ సింగ్‌ ,రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల ఉరి

Mar 23, 2024 - 17:33
Mar 23, 2024 - 20:39
 0  146
విప్లవ తేజం ఎన్నటికీ అంతరించదు

నా శరీరంలోని ఒకొక్క రక్తపు బొట్టు దేశ స్వతంత్రానికి  బీజమై పెరగాలి. 

అమరజీవి కావాలన్నా కోరికతో మా హృదయాలు నిండిపోయాయి నా వస్త్రాలను కాషాయరంగు తో తడపండి . 

నీ జీవితాన్ని ఇంకొకరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళు అన్న  భావాలు  ఆనాటి యువతరాన్ని ఉత్తేజ పరిచాయి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నట్లు "భగత్ సింగ్ ఇప్పుడు ఒక వ్యక్తి కాదు-

ఆదర్శ చిహ్నం. దేశాన్ని ఉర్రూతలూగిస్తూన్న విప్లవకాంక్ష ప్రభంజనానికి భగత్ సింగ్ ఒక గుర్తు, మార్గదర్శి! అతని ఆత్మశక్తినెవ్వరూ ఓడించలేరు.

ఆ శక్తి రగిలించిన విప్లవ జ్వాలల్ని ఎవరు ఆర్పలేరు" అన్న మాటలు గుర్తుకు తెచ్చుకునే ఈ రోజు భగత్ సింగ్ కు నివాళులు అర్పించే రోజు.

"ఆ రోజుల్లో భగత్ సింగ్ పేరు భారతదేశం పేరు భారతదేశ నలుమూలల గాంధీజీ పేరు వలె విఖ్యాతమైపోయిందనుట అతిశయోక్తిగా" పట్టాభి సీతారామయ్య వారి " కాంగ్రెస్ చరిత్ర"లో రాశారు

ఈ వాక్యంలో ఎంతైనా సత్యం ఉన్నది.భగత్ సింగ్ సమకాలీన భారతదేశంలోనే కాక స్వాతంత్ర్యానంతర భారతదేశంలో కూడా విప్లవానికి చిహ్నంగా ప్రసిద్ధిచెందారు.

భగత్ సింగ్ పేరుస్మరిస్తేనే భారతీయులందరి హృదయాలు ఉత్తేజితమవుతాయి.

ఆయన గురించి మాట్లాడుకుంటే తెలియకుండానే పిడికిళ్ళు బిగిస్సుకుంటాయి.

ఉరికొయ్యల ను ముద్దాడిన వీరుడువిప్లవ మూర్తి ,చైతన్యం నింపుకున్న త్యాగమూర్తి, సాహసి, గొప్ప ఆలోచనపరుడు,

ధీరోధాత్త నాయకుడు 23 ఏళ్లకే తన ప్రాణ సమానులైన మిత్రులు సుఖదేవ్రాజ గురువులతో పాటు ఉరి కంభం ఎక్కిన త్యాగశీలి.

భగత్ సింగ్ పూర్వపు పంజాబ్‌లోని, ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా సమీపంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలోని సంధు ఝాట్ కుటుంబంలో సర్దార్ కిషన్ సింగ్ , విద్యావతి దంపతులకు 28-09-2024 న జన్మించాడు. భగత్ అనే పదానికి "భక్తుడు" అని అర్థం. సింగ్‌ దేశభక్త సిక్కు కుటుంబంలోని కొందరు భారత స్వాతంత్ర్యోద్యమాల్లోనూ, మరికొందరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలోనూ పనిచేశారు.

అతను పినతండ్రులు అజిత్ సింగ్, స్వరణ్ సింగ్ తండ్రులు కర్తార్ సింగ్ సారభా గ్రివాల్ , హర్ దయాల్ నేతృత్వంలోని గద్దర్ పార్టీ సభ్యులే.13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి భగత్ సింగ్ ప్రభావితుడయ్యాడు.భగత్ సింగ్ లాలా లజ పతి రాయ్ ప్రసంగాలచే  ప్రభావిత్రుడైనాడు.భగత్ సింగ్  ను ప్రభావితం చేసిన మరో గొప్ప వ్యక్తి ఇటలీ జాతీయ పిత జోసెఫ్ మాజీని.

భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ పినతండ్రి  అజిత్ సింగ్ కూడా భారత స్వాతంత్రం కోసం పనిచేసిన విప్లవకారులు.2017లో భగత్ సింగ్ ఉపనయనం సమయాన మనువన్ని దేశానికి అంకితం చేస్తానని తాత అర్జున్ సింగ్ ప్రకటన చేశాడు. భగత్ సింగ్ పుస్తకాల బాగా చదవడమే కాకుండా వివిధ అంశాలపై పట్టుఉండి అర్జున పత్రికకు విలేకరిగా ప్రతాపత్రికకు సహాయ సంపాదకుడిగా  పని చేసినాడు.భగత్ సింగ్ పంజాబ్ లో కీర్తి కిసాన్ పార్టీని స్థాపించాడు.

మహాత్మా గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రభావితుడైన భగత్ సింగ్ 1922 ఫిబ్రవరి 5 న జరిగిన చౌరి చౌరా సంఘటనతో  అహింసాహితముగా  కొనసాగించాలనుకున్న ఉద్యమం హింసాహితంగా మారేసరికి 1922 ఫిబ్రవరి 12న గాంధీజీ ఈ ఉద్యమాన్ని నిలిపివేసినాడు అసంతృప్తి కి లోనైనా భగత్ సింగ్ అహింసాయిత సిద్ధాంతాలకు దూరంగా ఉండి విప్లవాత్మక ధోరణి ద్వారా బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టవచ్చు భావించి విప్లవాత్మక కార్యకలాపాల వైపు మొగ్గు చూపాడు. విప్లవం సంపూర్ణంగా విజయవంతం కావాలంటే విస్తృతస్థాయి ప్రజా ఉద్యమాలే మార్గమని విశ్వసించాడు ప్రజల కోసం ప్రజల ద్వారా మాత్రమే విప్లవం సాధ్యమని తేల్చాడు .అందుకే భగత్ సింగ్ 1926 లో పంజాబ్ నవ జవాన్ భారత్ సభను ప్రారంభించాడు.

యువకులను ఆకర్షించాలంటే ' ఆచరణ ద్వారా ప్రచారం ఒక్కటే మార్గమని' వ్యక్తిగత శౌర్య ప్రతాపాలను ప్రదర్శించే కార్యకలాపాలకు సంకల్పించడం ద్వారా వారి త్యాగాలను ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి ఎక్కువగా ప్రయత్నించారు.

 అనేక విప్లవాత్మక సంస్థల్లో అతను చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం (HRA)లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన అతను, ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (HSRA)గా మార్చాడు.

 భగత్ సింగ్ ను సోషలిజం వైపు తీసుకువచ్చిన కీర్తి నిజానికి ఇద్దరు వ్యక్తులకు చెందుతుంది .అందులో ఒక సోహన్ సింగ్ జోష్ లాలా చాబిన్ దాస్.     అనేక విప్లవాత్మక సంస్థల్లో అతను చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం (HRA)లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన అతను, ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (HSRA)గా మార్చాడు భగత్ సింగ్ భావాలు త్వరిత గతిన సోషలిజం వైపు మారాయి. భగత్ సింగ్ పుస్తకాలను తినేసేవాడు అంటే బాగా చదివేవాడు సోవియట్ యూనియన్, ఐర్లాండ్, ఫ్రాన్స్ ,ఇండియాలోని ఉద్యమాల గురించి అనార్కిజం, మార్కిజం గురించి చాలా ఇష్టంగా చదవేవారు. 1928 మూసేటప్పటికీ తమ ఉద్యమ లక్ష్యం సోషల్ నిజమని ప్రకటించి తమ పార్టీ పేరును కూడా  మార్చి వేశారు.

 1927 నవంబర్ 27న   ఈ కమిషన్ ను నియమించడం జరిగింది. జాన్ సైమన్ అధ్యక్షతన నియమించిన ఈ కమిషన్ లో ఏడుగురు  ఆంగ్లేయులు ఉండడం ఒక భారతీయుడు కూడా ఈ కమిషన్ సభ్యుల్లో ఉండకపోవడం వల్ల ఈ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు వ్యతిరేకించాలని తీర్మానాలు చేయడం జరిగింది .ఈ కమిషన్ వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వివిధ ప్రాంతాల్లో జాతీయ ఉద్యమ నాయకులు నాయకత్వం నుంచి సైమన్ గో బ్యాక్ నినాదంతో నిరసన ప్రదర్శనలు చేశారు అదేవిధంగా ఈ కమిషన్ 30-10-1928 న లాహోర్ వచ్చినప్పుడు లాహోర్ లో ఈ ఉద్యమానికి లాలాలజపతి రాయ్ నాయకత్వం వహించి సైమన్ గో బ్యాక్ అనే నినాదాలతో ఈ ఉద్యమాన్ని నడుపుతున్న సమయంలో పోలీస్ అధికారి జేమ్స్ స్కాట్ నిర్ణయం మేరకు  సాండర్స్ లాలలాజపతి రాయ్ చాతి పైన ,శరీరం మొత్తం పైన విపరీతమైన లాఠీచార్జ్ చేశాడు ఈ సందర్భంగా లాలాజపతిరాయ్ మాట్లాడుతూ "మన మీద పడుతున్న ఒక్కొక్క లాటి దెబ్బ  బ్రిటన్  నిర్మించుకుంటున్న తన శివపేటిక మీద మేకై దిగుతుంది " అని వ్యాఖ్యానించాడు  లాటి ఛార్జ్ కి గురైన లాలా లజ పతి రాయ్ 17-11-2028 న మరణించాడు. లాల లజపతిరాయ్ మరణం తర్వాత ప్రజలందరిని  తీవ్ర దుఃఖం అలముకుంది. లాలా రాజా పతి రాయ్ పై దాడి దేశం పై దాడి చేసినట్లే ఆ దాడి మన పౌరుషానికి సవాలు వంటిది అంటూ ఆ సవాలుని స్వీకరించారు. భగత్ సింగ్ మరియు అతని మిత్రులు.ఈ దేశం లోని కోట్లాదిమంది ప్రజలు ఆరాధించే ఒక మహోన్నతమైన నాయకుడు ఒక సాధారణ పోలీసు అధికారి పాపపు చేతులలో చేతుల్లో కనుమూయడం ఈ జాతికే అవమానం .దాని చెరిపివేయడం ఈ దేశ యువకుల విద్యుక్త ధర్మం. ఒక వ్యక్తిని చంపాల్సి వచ్చినందుకు మేము బాధపడుతున్నాం కానీ అతడు ఒక అమానుష అక్రమ నిర్మాణంలో అంతర్భాగం దాని అంతం చేయాల్సిన అవసరం ఉంది.

  దీనికి ప్రతికారంగా మరణానికి కారణమైన  ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్ మరియ సుఖ్‌దేవ్ థాపర్‌లతో అతను చేతులు కలిపాడు. సాండర్స్ ను17-12-1928 న భగత్ సింగ్ మిత్రులైన రాజగురు , సుఖ్ దేవ్ లతో కలిసి లాహోర్ లో దయానంద్ ఆంగ్ల వేదిక్ కళాశాల సమీపంలో పట్టపగలు నిర్భయంగా కాల్చి చంపారు.దాంతో పోలీసుల కంటపడకుండా ఉండటానికి సాండర్స్  హత్య తరువాత వీరు ప్రవాసంలో కి వెళ్ళిపోయారు.గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెండ్రుకలు కత్తిరించుకోవడం ద్వారా దేశం కోసం సిక్కు మత విశ్వాసాల ను  కూడా పక్కన పెట్టాడు భగత్ సింగ్.భారతదేశాన్ని  అవమానపరచడం ద్వారా విదేశీ ప్రభుత్వం ఆత్మ గౌరవం గల వీర పుత్రులకు సవాలు విసిరింది అలాంటి అవమానాలను సహించడానికి భారత జాతిలో చేవ చావలేదు అది ఇంకా నిర్జీవం కాలేదని బ్రిటిష్ ప్రజలూ ,భారతజాతి   సాండర్స్  ను హత్య చెయ్యడం  ద్వారా అర్థం చేసుకున్నారు మరియు భారత ప్రజల  రక్తనాళాల్లో కొత్త రక్తం పారుతుంది. తమ జీవితాల్ని త్యాగం చేసైనా  జాతి గౌరవాన్ని కాపాడటానికి యువ భారతదేశం సిద్దంగా ఉంది అని ఈ సంఘటన రుజువు చేసింది.

  శాసనసభలో బాంబు- హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆన్ ఆర్మీకి చెందిన సమావేశాలలో శాసనసభలో బాంబు పేల్చేందుకు బట్టుకేశ్వర్ దత్తును, విజయకుమార్ సిన్హా గార్ల పేర్లు నిర్ణయం అయ్యాయి. కేంద్ర శాసనసభలో బాంబులు పేల్చేందుకు విజయకుమార్ సినహస్థానంలో భగత్ సింగ్ పంపించడానికి పూర్తి బాధ్యత సుఖదేవుడే భగత్ సింగ్ స్థానంలో మరో వ్యక్తి వెళ్తే ఆ చర్యకున్న రాజకీయ లక్ష్యం నెరవేరదని అలా చేశారు.

 

  విచారణ, ఉరి-   సింగ్ అరెస్టు అనంతరం శాసనసభ పేలుడుపై విచారణ నేపథ్యంలో J. P. సాండర్స్ హత్య వెనుక అతను హస్తంపై బ్రిటీష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్‌గురు , సుఖ్‌దేవ్‌లపై అభియోగాలు మోపారు.సహాయ నిరాకరణం ఉపసంహరించబడిన తర్వాత దేశంలో రాజకీయ చైతన్యం చాలావరకు తగ్గింది. విదేశీ పరిపాలనపై తిరుగుబాటు చేసే ధోరణి ప్రజలలో తగ్గింది. విప్లవకారులకు ఈ ధోరణి చాలా అసంతృప్తిని కలిగించింది ప్రజలలో స్వాతంత్ర తృష్ణను తిరిగి రేకెత్తించడం తమ ధర్మంగాను దానికి దేశానంత ఆకర్షించగల ఒక విప్లవ కార్యక్రమం తగిన సాధనంగానూ  వారు భావించారు. దీన్ని ఆచరణలో పెట్టడానికి భగత్ సింగ్, బటుకేశ్వర దత్తా పూనుకున్నారు. 1929 ఏప్రిల్ 8న ఢిల్లీలో కేంద్ర శాసనసభ సమావేశం కార్మికుల సమ్మె చేసే హక్కును రద్దు చేయడానికి ఉద్దేశించిన " వాణిజ్య వివాదాల బిల్లు" గురించి ఓటు చేయవలసి ఉంది ఇదేగాక కమ్యూనిస్టులను అణిచి వేసే " ప్రజారక్షణ బిల్లు" ను కూడా అదే రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టింది .విటల్ భాయ్ పటేల్ స్పీకర్ గా ఉన్నటువంటి సమయంలో ఈ సమావేశం జరుగుతున్నటువంటి  ఆరోజు శాసనసభలో ప్రవేశించి ప్రాణహాని లేని పోగ బాంబులను ప్రయోగించి తమ ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నట్లు సంచలనం కలిగించడం వీరి లక్ష్యం.కార్మిక సమ్మె  చట్టంపై ఓటింగ్ జరిగిన వెంటనే శాస సభ మధ్య భాగంపై మొట్టమొదట భగత్ సింగ్ ఆ తర్వాత బటు కేశ్వర దత్తా ఒక్కొక్క బాంబును పేల్చారు. బాంబు పేల్చినవారు అక్కడ నిలబడి విప్లవం శాశ్వతంగా వర్ధిల్లు గాక సామ్రాజ్యతత్వం పతనమైపోవుగాక అనేనినాదాలతో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ సంఘము కరపత్రాలను సభలో విసిరారు ఇంతలోనే పోలీసు వారు అరెస్టు చేసి తీసుకొని వెళ్ళిపోయారు. విప్లవం శాశ్వతంగా వర్ధిల్లు గాక అనే నినాదమే (ఇంక్విలాబ్ జిందాబాద్) విప్లవం  వర్ధిల్లాలి గా దేశంలో ఇట్లా నినాదంగా స్థిరపడిపోయింది.

 స్వప్న జగత్తులోని ఇంగ్లాండ్ ను నిద్ర లేపడానికి బాంబు కావాల్సిందే అని తమ హృదయ వేదనను ప్రకటించడానికి ఏ దారి లేని వారి తరఫున నిరసన తేల్చడానికి సెంట్రల్  అసెంబ్లీలో బాంబులు విసిరాము. ఈ విషయంలో మా ఏకైక లక్ష్యం చెవిటి వారు వినేటట్లు చేయడమే,మూర్ఖుల మనస్సు మార్చడానికి మీము బాంబులు  విసిరాము, తల లేని వాళ్లకు సరైన సమయంలో హెచ్చరిక చేయడం పైకి చూస్తే అంతా ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ భారత జాతి మానవ మహాసాగరం లోలోపల భయంకర కల్లోలం చెల్లరేగుతున్నది తోసుకొస్తున్న ప్రమాదకర పరిస్థితులను కానక పరుగులు పెడుతున్న వారి కోసం ఒక ప్రమాద హెచ్చరిక చేశాం.

 

వీరిద్దరిని అరెస్టు చేసిన అనంతరం  70 వేల బాంబులు తయారు చేయడానికి  కావాల్సిన ముడి పదార్థాలతో కూడిన ఒక ఫ్యాక్టరీని కనుగొన్నారు. ఇదే సమయంలో సాండర్స్ ను హత్య చేసిన వారు భగత్ సింగ్ అనేది వెల్లడి అయినది .భగత్ సింగ్ సుఖదేవ్, రాజగురుపై లాహోర్ కుట్ర కేసు  ను మోపారు. ఢిల్లీ అసెంబ్లీ బాంబు కేసు లో భగత్ సింగ్ బట్టుకేశ్వర్ దత్తులకు యావజీవ శిక్ష పడింది వారిలో ఒకరిని మియానువాలి మరొకరిని లాహోర్ జెల్లో పెట్టారు.

 

 మియాన్ వాలీ జైల్లో ఉన్న భగత్ సింగ్ రాజకీయ ఖైదీలకు ఉన్న వసతులు మెరుగుపరచాలంటే నిరాహార దీక్ష చేశాడు. 1929 జూన్ 4న అసెంబ్లీ లో బాంబుకేసు పై ఢిల్లీలో విచారణ ప్రారంభమై జూన్ 12 న  యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది. జూన్ 14న ఖైదీల హక్కులకై నిరాహార దీక్ష చేశారు. 1929 జూలై 10న లాహోర్ కుట్ర కేసు ప్రారంభించారులాహోర్ కుట్ర కేసు తీర్పులో  భగత్ సింగ్ రాజగురు సుఖదేవులకు 7- 10 -1929న ఉరిశిక్షను ను విధించారు. భగత్ సింగ్ తనపై నమోదైన  కేసులలో  క్షమాభిక్షకు ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. చేయనీయలేదు.

మేము చనిపోయే వరకు మా మెడ చుట్టూ ఉరితాడు బిగించుతారు. దేశభక్తికి  ఇది అత్యున్నతమైన బహుమతి .దాని సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా శరీరాన్ని నాశనం చేయడం ద్వారా ఈ దేశంలో తాము సురక్షితంగా ఉండగలమని బ్రిటిష్ వారు తలస్తున్నారు వారు అలా అనుకోవడం తప్పు. వాళ్లు నన్ను చంపి వేయవచ్చు .కానీ నా భావాలను వారు అణిచివేయలేరు ఒక శాపం వలే నా భావాలు బ్రిటిష్ వారిని వెంటాడుతాయి  దానితో చివరికి వారు ఇక్కడ నుండి పారిపోవలసి వస్తుంది.

 

 భగత్ సింగ్ కు మరణశిక్ష విధించిన తర్వాత ఉరిశిక్ష అమల కోసం ఎదురుచూస్తున్న ఇతర ఖైదీలందరూ ఉరితాడు తప్పించాలని భగవంతుని ప్రార్థన  చేసుకుంటున్నారు కానీ వాళ్ళందరిలోనూ బహుశా భగత్ సింగ్ ఒక్కడే ఆదర్శాల కోసం భారత స్వాతంత్రం కోసం ఉరి కోయిల ముద్దాడే అదృష్టం ఎప్పుడు కలుగుతుందా అని ఆత్రంగా ఎదురు చూశారు .ఈ ముగ్గురు విప్లవకారులు భగత్ సింగ్,రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లను 1931 మార్చి 23న భగత్ సింగ్‌తో పాటు అతను సహచరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం గం. 7.33 ని.లకు సమయానికి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరిశిక్ష అమలు జరపడం జరిగేది కాదు. వారి మృత దేహాలను రహస్యంగా, జైలు వెనుక గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళి సట్లెజ్ నది తీరాన హుస్సేన్‌వాలా అనే ఊరిలో దహనం చేసేవారు. మృత దేహాలను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు.

 

 బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు బ్రతికున్న భగత్ సింగ్ కంటే చనిపోయిన భగత్ సింగ్ మరింత ప్రమాద కారు కారి నన్ను ఉరివేసిన తర్వాత ఆ విప్లవ భావాలు ఈ సుందరమైన మన మాతృభూమి అంతట వ్యాపించుతాయి ఆ భావాలు మన యువతకు మత్తెక్కించి స్వాతంత్రం కోసం స్వాతంత్ర్యం కోసం విప్లవం కోసం తపించేటట్లు చేస్తాయి ఇది నా దృఢ విశ్వాసం నా దేశం కోసం నా ప్రజల కోసం నేను చేసిన సేవలకై అత్యున్నతమైన బహుమతిని పొందే రోజుకోసం ఆదుర్దాతో నేను ఎదురు చూస్తున్నాను ఒక సంవత్సరం లోపునే భగత్ సింగ్ జోష్యం నిజమైంది మృత్యువును కూడా ధిక్కరించే ధైర్యసహసాలకు త్యాగానికి దేశభక్తికి దృఢ సంకల్పానికి ఆయన పేరు సంకేతంగా మారింది సోషలిస్టు సమాజాన్ని నెలకొల్పాలున్నాయన కలలు విద్యార్థికులైన యువకులను బ్రహ్మాండంగా ఆకర్షించాయి ఇంక్విలాబ్ జిందాబాద్ అని ఆయన ఇచ్చిన నినాదం మొత్తం దేశానికే సమర నినాదం అయింది.

 

  ఫిరోజ్ పూర్  వద్ద సట్లేజ్ నది ఒడ్డుకు తీసుకెళ్లి మొక్కల ముక్కలుగా నరికి కిరోసిన్ పోసి మంటలు పెట్టారు .ఆ మంటల చుట్టూ రండి రాక్షసులారా ఇప్పుడు తుపాకులు పేల్చండి .అంటూ నృత్యం చేయడం మొదలుపెట్టారు ఇంతలో ఆ వార్త తెలిసిన ప్రజలు అక్కడికి చేరి ఇంకా కాలకుండా ఉన్న అవశేషాలను లాహోర్ తీసుకెళ్లి అత్యంత గౌరవపూర్వకంగా అంత్యక్రియలు జరిపారు. బ్రిటిష్ సైనికులు పైశాచిక తాండవ నృత్యం చేసిన చోటనే హుస్సేన్ వాలాలో ఇప్పుడు భగత్ సింగ్ ,రాజగురు, సుఖదేవ్ స్మారక చిహ్నాలు ఉన్నాయి.

 తాను దేశం కోసం తన మత సిద్ధాంతాలను పక్కకు పెట్టి తలవెంట్రుకలు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం" జరిగింది. "దేశ సేవ కోసమే అదంతా చేశాడు". భగత్ సింగ్ దేశ స్వాతంత్ర ఉద్యమానికి ఇచ్చిన తోడ్పాటు అద్భుతమైనది వారి అనన్యమైన దేశభక్తి, ధైర్యసాహసాలు, పట్టుదల త్యాగనిరతి దేశ ప్రజలను ఒక కుదుపు కుదిపివేశాయి.

(ఈ వ్యాసకర్త చరిత్ర విశ్లేషకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరి కె యన్ యమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల  మిర్యాలగూడ, జిల్లా నల్గొండ, తెలంగాణ)

నర్సింగు కోటయ్య

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరి

కె యన్ యమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

మిర్యాలగూడ

9985930885

8328440806

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333