ఆపదలో ఉన్న మిత్రున్ని ఆదుకున్న స్నేహితులు
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్:- మండల కేంద్రంలో ఏపూర్ గ్రామంలో ఇటీవల 24గంటల నొప్పితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న బండి మల్లయ్య కు తనతో పాటు చదువుకున్న పదోవ తరగతి మిత్రులు మానవతా దక్పధంతో అందరూ కలిసి 16000 రూపాయల ఆర్థిక సాయం అందించారు .తనతో చదువుకున్న మిత్రునికి ఆపదలో ఉన్నాడు అని తెలుసుకొని 20 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న మిత్రుడు ఆపదలో ఉన్నాడాని తెలుసుకొని మేమున్నామంటూ ముందుకొచ్చారు. ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమ లో దామిడి రాజు,గంగరాబోనా రమేష్,యాదగిరి, అయీ పాష మరియు పదవతరగతి మిత్రులు పాల్గొన్నారు.