మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసిన వరంగల్ ఎంపీ డా"కడియం కావ్య
వరంగల్ 08 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ "కడియం కావ్య మహిళలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా మహిళల అందరికీ వందనాలు నా ధన్యవాదాలు.ఆధునిక మహిళలు ఇకపై పురుషులపై ఆధారపడే అవసరం లేకుండా ముందుకు సాగుతున్నారు.ఆమె ప్రతి అంశంలోనూ స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. పురుషులతో సమానంగా ప్రతిదీ చేయగలుగుతుంది.స్త్రీ శక్తి అసాధారణమైనది.ఆమె ఎక్కడ పని చేసినా కూడా ఆ ప్రదేశం భోగ భాగ్యాలతో వర్ధిల్లుతుంది. ఆమె తన చుట్టూ ఉన్న ప్రపంచంలో మార్పు తెచ్చేందుకు ఎంతో కృషి చేస్తుంది. పిల్లల్ని పెంచడం, కుటుంబాన్ని నిర్మించడం, పెద్దవారి బాగోగులు చూసుకోవడం వంటి వాటిలో కీలక పాత్ర పోషిస్తుంది. మహిళల విజయాలను తలచుకొని నిర్వహించుకోవడానికి ఒక రోజు ప్రత్యేకంగా ఉండడం చాలా ఆనందంగా ఉంది.ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మన జీవితంలో, సమాజంలో మహిళల ప్రాముఖ్యతను గుర్తించి వారికి తగిన అవకాశాలను కల్పిస్తారని కోరుకుందాం...తెలంగాణ మరియు వరంగల్ జిల్లా మహిళలకు మహిళ దినోత్సవ శుభకాంక్షలు తెలియజేసిన వరంగల్ ఎంపీ కడియం కావ్య