విద్యారంగంలో కొనసాగుతున్న పెడధోరణులు

Apr 7, 2024 - 19:40
Jun 30, 2024 - 13:19
 0  17
విద్యారంగంలో కొనసాగుతున్న పెడధోరణులు

స్వస్తి పలకకుంటే  రాష్ట్ర భవిష్యత్తు నిర్వీర్యమయ్యే ప్రమాదం.

విద్యా ప్రవేటీకరణను కూలదోయాలి.

 ప్రభుత్వ రంగము లోనే నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి.

కామన్ స్కూల్  గగన కుసుమము కాకూడదు.

 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దృష్టి సారించాలి.

కొత్త సర్కారు ప్రజా ప్రభుత్వంగా నిలబడాలంటే---5 

--వడ్డేపల్లి మల్లేశం 

'"భారతదేశంలో  విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని  ఉచిత నాణ్యమైన  రీతిలో  సామాజిక న్యాయాన్ని కూడా ప్రజలకు అందించాలని  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆకాంక్షించాడు . అదే సందర్భంలో పాలకుల యొక్క వికృతి ధోరణిని ఎండగడుతూ  ప్రభుత్వాలు అంత సాహసం చేసి  ఈ మూడింటిని ఉచితంగా అందించడానికి  సిద్ధపడవు అన్నారు. ఎందుకంటే " విద్యా వైద్యం సామాజిక న్యాయం  ప్రజలకు అట్టడుగు వర్గాలకు ఉచితంగా అంది0చిన ట్లయితే  ఆరోగ్యంగా ఉండి, చైతన్యవంతులై , సామాజిక పరిజ్ఞానాన్ని సంతరించుకొని  పాలకులను ప్రశ్నించిప్రతిఘటిస్తారని తమ మను గడే ప్రశ్నార్థకమైన పరిస్థితులలో  ఏ ప్రభుత్వం కూడా  సాహసించదు" అని కూడా  అంబేద్కర్  వివరణ ఇవ్వడాన్ని బట్టి  పాలకుల అవకాశ వాదాన్ని అర్థం చేసుకోవచ్చు.  దాని కారణంగా భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికీ  కొఠారి సూచించిన కామన్ స్కూల్ విధానం అమలుకు నోచుకోకపోగా  రాష్ట్ర బడ్జెట్లో 30% కేంద్ర బడ్జెట్లో 10% విద్యా రంగానికి నిధులు కేటాయించాలని చేసిన సూచన  మిధ్యగానే మిగిలింది.  ఈ సందర్భంలో ప్రజలకు  పేద వర్గాలకు   నాణ్యమైన స్థాయిలో అందించడానికి  పాలకులు కృషి చేయాలని  విద్యా పరిరక్షణ కమిటీ మేధావులు బుద్ధి జీవులు మానవ హక్కుల కార్యకర్తలు అనేక దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ను  తెలంగాణలో గత పది సంవత్సరాలుగా  పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం  పెడచెవిన పెట్టిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంలో రాష్ట్రంలో అధికారానికి వచ్చిన  కాంగ్రెస్ నాయకత్వంలోని రెండవ ప్రభుత్వం అయినా   పెడ దోర నులను  అధిగమించి  సామాజిక మార్పుకు  దోహదపడే విద్యను  బలియమైన శక్తిగా   తీర్చిదిద్దుతుందని ఆశిద్దాం.  లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా పాలకులను హెచ్చరించవలసిన అవసరం ఉన్నది.

--  విద్యారంగంలో  నిక్కచ్చిగా రాదగిన మార్పులు -   ప్రభుత్వం తీసుకోవాల్సిన  అత్యవసర చర్యలు:-

రాష్ట్రంలో  సుమారు 55 శాతం  విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతుంటే  45 శాతం మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయి.  ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం కావచ్చు , లేదా గత పది ఏళ్లలో సుమారు 5000 పాఠశాలలు మూతపడడానికి గత ప్రభుత్వం కారణమైన వేల  రోజురోజుకు ప్రైవేట్ రంగం మరింత బలపడుతుంటే  పేద విద్యార్థులు లక్షల రూపాయ ల్లో ఫీజులు చెల్లించలేక,  ప్రభుత్వ ఆసరా లేక,  ప్రభుత్వ చర్యలు లేక కునారి ళ్ళిపోతున్నారు.  మొత్తం విద్యారంగాన్ని ప్రభుత్వం ఆధీనం చేసుకోవాలి లేకుంటే  ప్రైవేటు పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు  ఐదు లక్షల లోపు ఆదాయానికి  పరిమితమైన వాళ్ళ పిల్లలకు  ఫీజును ప్రభుత్వమే చెల్లించాలి. మరొకవైపు  ప్రైవేట్ రంగంలో ఫీజుల నియంత్రణపై  గత ప్రభుత్వ అసంపూర్తి చర్యలను వేగవంతం చేయాలి .
-- ప్రస్తుతము  రాష్ట్రంలో 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కొనసాగుతుంటే  మరో 7 ప్రైవేట్ రంగంలో రావడానికి  గవర్నర్ ముందు బిల్లులు  వేచి ఉన్నాయి అంటే ప్రభుత్వం యొక్క  విద్యారంగ ధమని నీతిని మనం గుర్తించవచ్చు . గత బి ఆర్ ఎస్ పాలకుల పుణ్యమా అని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను అనుమతిo జిచిన తీరుపై  ప్రస్తుత ప్రభుత్వం  దర్యాప్తు జరిపించి  ప్రైవేటు విశ్వవిద్యాలయాలను  రద్దు చేసే ప్రభుత్వ రంగంలోనే విశ్వవిద్యాలయ విద్యను బలోపేతం చేయాలి.  కేవలం ఉస్మానియా లోనే  వందల ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు  నిధులు లేక నిర్వహణ  బ్రష్టు పట్టిపోయినట్లు  ప్రభుత్వ గణాంకాలే తెలియచేస్తున్నాయి.
--  ఉన్నత విద్య ఏ స్థాయి వరకైనా  అల్పాదా య వర్గాలకు  పూర్తిగా ఉచితంగా అందే విధంగా  కట్టుది ట్ట మైన చర్యలు తీసుకవాలి . పేద వర్గాలకు  విద్యా కార్డులను మంజూరు చేసి  ప్రభుత్వ లేదా ప్రైవేటు విద్యాసంస్థల్లో
  ఉచితంగా  అందుబాటులోకి తీసుకురావాలి.
--  గత నాలుగైదు సంవత్సరాలుగా  ప్రభుత్వ పాఠశాలల లో ముఖ్యంగా  ఫుడ్ పాయిజన్ ,నీటి సౌకర్యం లేక,  మౌలిక సౌకర్యాల కొరత  వంటి కారణాలతో  నైవాసిక స్కూలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలు పాఠశాలల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలను మనం చూసి ఉన్నాం  .అలాంటి లోపాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
--  కళాశాలలు విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లో  భోధన,బోధనేతర సిబ్బంది  పూర్తిస్థాయిలో భర్తీ చేసి  వేచి ఉన్న నిరుద్యోగులకు స్వాంతన కల్పించి  విద్యా నాణ్యతను  పెంచవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
--  విద్యా రంగంలో  కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్  ,ఏక మొత్తం వేతనంతో  కాకుండా  రెగ్యులర్ ఉద్యోగులుగా  నియామకం చేసి  పెట్టి చాకిరీని రద్దు చేయాలి.
---  కొటారి సూచించిన కామన్ స్కూల్ విధానాన్ని  తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టి  ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా తెలంగాణ రాష్ట్రం ప్రపంచం తోనే పోటీపడే విధంగా  ముందు వరసలో నిలపాలి. ఎందుకంటే అమెరికాలో ఇప్పటికీ ఆ విధానం కొనసాగుతున్నది కనుక .
-- గత ప్రభుత్వం కులాల వారీగా పాఠశాలలను ఏర్పాటు చేసి  కామన్ స్కూల్ విద్యా ప్రయోజనాలకు గండి కొట్టిన విషయం అందరికీ తెలిసిందే . ముఖ్యమంత్రి పిల్లలు  కార్మికుల పిల్లలు  పేదవాడి పిల్లలు కూడా ఒకే పాఠశాలలో చదివి  సమానత్వాన్ని సాధించే  ఉన్న థా శయంతో  పాఠశాల విద్యను  పునర్ నిర్వచించాలి.  పునర్నిర్మానం చేయాలి .
---   అకౌంట్లో నగదు  వేసే దుష్ట సంస్కృతికి తెరదించి  అల్పదాయ వర్గాలకు  ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చి  పేదలను  బుద్ధి జీవులు, మేధావులుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకోవాలి.  పేద వర్గాలకు అందని ద్రాక్షగా విద్య మిగలకూడదు.
---  గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన  ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్  సుమారు 5 వేల కోట్లు  వెంటనే మంజూరు చేసి లబ్ధిదారులకు అందించాలి.
--  విద్యాలయాలకు పక్కా భవనాలు, మౌలిక సామాగ్రి, బోధన సిబ్బందిని  పూర్తిస్థాయిలో  కల్పించడానికి , కేరళ ఢిల్లీ ఇతర ప్రభుత్వాల మాదిరిగా  రాష్ట్ర బడ్జెట్లో 25 శాతం నిధులను కేటాయించాలి. ఎందుకంటే గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ వాటా 7  శాతం కూడా దాటలేదు కనుక.  అంతెందుకు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాలంలో కూడా 17% నిధులను విద్యకు కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే.
     నాణ్యమైన ఉచిత విద్యను  అట్టడుగు ,ఆదివాసి, పేద, గిరిజన,  మధ్యతరగతి కుటుంబాలకు  అందుబాటులోకి తీసుకువస్తే    లక్షలాది కుటుంబాలు కోట్లాది ప్రజలు  విద్యారంగ పలాలను అందుకోవడానికి,  ప్రజాస్వామి క ప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి,  చైతన్యవంతులై తమ హక్కులను సాధించుకోవడంతోపాటు  సమాజం చైతన్యవంతం చేయడానికి  ఆస్కారం ఉంటుంది .   రాష్ట్ర ప్రభుత్వం  చొరవతో  గత ప్రభుత్వం ఏనాడూ చేయని విద్యారంగ సమీక్షను వెంటనే ప్రారంభించి  అన్ని అంశాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలి . .విద్యారంగం పేరుతో వ్యాపారం చేస్తూ  పేద వర్గాలను దోపిడీ చేస్తున్న పెట్టుబడిదారీ విధానానికి  చరమగీతం పాడాలి. ప్రజల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పని చేసి   విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో  ప్రక్షాళన చేయవచ్చు.  "ప్రపంచం నివ్వెర పోయే స్థాయిలో పరిపాలన అంటే ఇదే కానీ   మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదానికే పరిమితమై బంగారు తెలంగాణ  అని  భ్రమలు పెంచిన  పరిపాలన కాదు "అని ప్రజలు కూడా తెలుసుకొని ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వాన్ని అదే సందర్భంలో ప్రశ్నించాలి,  మెరుగైన విద్యారంగాన్ని సాధించుకోవాలి,  ప్రశ్నించకుండా ఏ ప్రభుత్వం కూడా  ప్రజల పక్షాన పని చేయదు అనే సోయి ప్రజల్లో ముందుగా రావాలి.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌట పల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333