విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  చింత బాబు మాదిగ

Jun 16, 2024 - 21:00
Jun 16, 2024 - 22:06
 0  8
విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి

ప్రభుత్వ, కార్పోరేట్ విద్యా సంస్థల్లో విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింత బాబు మాదిగ డిమాండ్ చేశారు . ఆదివారం జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మార్పీఎస్ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు పల్లెటి లక్ష్మణ్ మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  గత ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యను విద్యార్థులకు అందిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసిందని ఆరోపించారు.  

 రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం 12000 పాఠశాలను మూసివేసిందన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని కోరారు .ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల పిల్లలే సరైన విద్య అంధక అన్ని రంగాల వెనుకబడిపోతున్నారని, విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .

ప్రతి ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో 25% సీట్లను నిరుపేదల కేటాయించాలని డిమాండ్ చేశారు.  ఇటీవల బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్య విధానం చట్టం విద్యను నిర్వీర్యం చేసేలా ఉందని ఆరోపించారు .ఈ విద్యా హక్కు చట్టం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనే అరకొరగా అమలవుతుందని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వాలు చూడాలన్నారు.  ఈనెల 19వ తారీఖున హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే రాష్ట్ర సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు.  కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి విజయ్ భాస్కర్ , రాష్ట్ర కార్యదర్శి బాణాల అబ్రహం ,తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి వంగాల వెంకన్న ఎమ్మెస్ ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రాపోలు మహేష్ ,చివేముల మండల ఉపాధ్యక్షుడు చెరుకుపల్లి సుధాకర్ చివేముల మండల ఇన్చార్జి చెరుకుపల్లి రజనీ కుమార్ ,మధు ,సైదులు ,జాను నరసయ్య పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333