నీలహళ్లి పెద్దవాగుపై అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని వినతి పత్రం.

జిల్లా కలెక్టర్ బి .యo సంతోష్ కుమార్  కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సరిత తిరుపతయ్యకు  

Mar 3, 2025 - 19:17
Mar 3, 2025 - 19:30
 0  2
నీలహళ్లి పెద్దవాగుపై అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని వినతి పత్రం.

 జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో నీలహళ్లి పెద్దవాగు నిర్మాణం అసంపూర్తిగా ఉన్నందున వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు చిలుక మునెప్ప ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ కు గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరిత తిరుపతయ్యకు వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా నీలహళ్లి గ్రామ ప్రజలు మాట్లాడుతూ ధరూర్ మండల కేంద్రంలో ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద బ్రిడ్జి కూల్చి కొత్త నిర్మాణం చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే,

బ్రిడ్జి కూల్చితే కూల్చారు ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపలేదు ఏ బ్రిడ్జి కొత్తగా నిర్మిస్తున్నా కొత్త రోడ్డును పోయే మార్గాన్ని చేసి కూల్చుతారు. అటువంటి ఆలోచన లేవీ చేయకుండానే ఈ పని చేయడం దారుణం. ఇంతటి దుర్మార్గం చేసిన వారు పాలకులు ఎవరైనా సరే త్వరగా అందుబాటులోకి తీసుకురాక పోవడం దారుణం, గద్వాల, రాయచూర్, వెళ్ళాలలంటే ఇరుకు దారిలో ప్రజలు పడుతున్న అవస్థలు బాధలు, వర్ణనాతీతం, ఎన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అవుతుందో లెక్కలేదు ఎన్నిసార్లు ప్రయాణికులు కింద పడ్డారో తెలీదు ప్రతి ఒక్కరూ తిట్టుకుంటూ పోయే వారే తప్ప దీనికి పరిష్కారం నేటికి చూడకపోవడం సిగ్గుచేటయినా విషయం. ఇటు మండలం అధికారులు గాని, ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గాని నేటికీ సమస్య వైపు తొంగి చూడకపోవడము సిగ్గు చేటు, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ సమన్వయం లోపం వల్ల జాప్యం  అవుతుంది అని చెబుతున్నారు తప్ప ఇన్ని వేల మంది పడుతున్న బాధలను తొలగించడం లేదు.

ఈ యొక్క బ్రిడ్జ్ 3 కోట్ల వ్యయం తో నిర్మిస్తున్నారు కానీ 2సంత్సరాలు కావొస్తున్నా పూర్తి కాలేదు కాంట్రాక్టర్ ను గ్రామ పెద్దలు అడగ్గానే మాకు బిల్లులు కాలేదు అందుకే ఆపివేశము అని చెప్పుకొచ్చారు.కావున గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే ఆలస్యం అవుతుందని  ఆర్ అండ్ బి ప్లాన్ లేకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని నీలహళ్లి  గ్రామస్తులు మరియు పాతపాలెం గ్రామస్థులు అంటున్నారు.  త్వరగా పూర్తిచేయాలనే ఇంకితజ్ఞానం లేని గత ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులు బొందపెట్టాలని ఇప్పుడు వున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అయిన మా యొక్క బ్రిడ్జ్ పనులను పూర్తి చేయాలనీ గ్రామ పెద్దలు చిలుక మునెప్ప చెప్పుకొచ్చారు వాస్తవo, ధరూర్ మండల్ రెండు భాగాలుగా విడిపోయింది kt. దోడ్డి మండల ప్రజలు అటు అవతల  ఇటువతల అని నవ్వుకుంటున్నారు.    మారుమూల గ్రామాలు అయిన నీలహళ్లి పాతపాలెం గ్రామస్థులు  గద్వాలకు పక్కన కర్ణాటక రాష్ట్ర సరిహద్దుగా రాయచూర్ పోవాలంటే రహదారి బాగాలేక ఉన్నాటివంటి బ్రిడ్జ్  వాగులగా మారిపోయింది బయట నుండి వచ్చిన వారికి అగమ్య గోచరంగా ఎటుపోవాలో దిక్కుతోచని స్థితిలో పోతున్నారు.  బాధలు పడే వారందరూ తిట్టుకుంటున్నారు, అయితే ఈ సమస్యను గతం నుండి కూడా పాలకులు పట్టించుకున్న సందర్భాలు తక్కువ ప్రతిదీ పోరాడి సాధించుకున్నదే ఎక్కువ. ఈలోగా ప్రభుత్వాలు మారాయి కాంగ్రెస్ పట్టించుకుంటాడేమో అని ఎదురుచూసిన ప్రజలకు నిరాశ మిగిలింది  గెలిచిన  ఈవైపు కన్నెత్తి చూడలేదు గవర్నమెంట్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయినా సరిత తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జి ఈ సమస్యను పరిష్కరిస్తారు అనుకుంటే అది జరగడం లేదు. ఇక  ప్రజలకు దిక్కు ఎవరు? ఇది ఎప్పటి ఇప్పటి పరిస్థితి. ముప్పోత్తుల పని ముడిపడింది ప్రజలను పట్టించుకునే నాధుడే లేడా! *ధరూర్ మండల పరిధిలో ఉన్నటివంటి  నీలహళ్లి గ్రామ ప్రజలు అందరు పార్టీలకు అతీతంగా పట్టింపులు లేకుండా కలిసి పోరాడితే తప్ప పరిష్కారం కానరావడం లేదు అని సమస్య పరిష్కారం కై గద్వాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సరిత తిరుపతయ్య జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఉపాధి పథకం ద్వారా పనులు చేపట్టి బ్రిడ్జిని పూర్తిచేస్తే ఇటు గ్రామస్తులకు సౌకర్యంతోపాటు నిరుద్యోగ లకు ఉపాధి అవకాశాన్ని కల్పించినట్లు అవుతుందని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రాస్తుస్తులు చిలుక మునెప్ప, బుల్లా వీరేష్, కృష్ణ మూర్తి, ఆటో రఫీ, కావాలి నాగరాజు, చాకలి విజేంద్ర, గురువు ఈరన్న,రాము, జగన్ తదితరులు పాల్గొన్నారు వాగు బ్రిడ్జ్ పూర్తి చేయాలనీ డిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333