సాగర సంగం ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆర్థికసహాయం

Jun 16, 2024 - 20:59
Jun 16, 2024 - 21:07
 0  70
సాగర సంగం ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆర్థికసహాయం

16-06-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.:- చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం  గ్రామంలో క్యాథూరి పరమేష్ సాగర్  దశదినకర్మ కార్యక్రమంలో గూడెం సాగర సంగం ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి సాగరులు అందరూ ఏకతాటిపైకి వచ్చి క్యాథూరి పరమేష్ సాగర్ కుటుంబాన్నికి అండగా ఉండటానికి గ్రామ సాగర సంగం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

 గ్రామంలో సాగర సంగం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేసినందుకు గ్రామంలో ఉన్నటువంటి కొన్ని కుల సంఘాలు సాగర సంఘాన్ని అభినందించాయి.  ఇట్టి కార్యక్రమంలో గూడెం గ్రామ సాగర సంగం అధ్యక్షుడు విష్ణు సాగర్, శివ సాగర్, జోగు రామచంద్ర సాగర్, బీచుపల్లి శాంతయ్య, సింగోటం వెంకటేష్, సింగోటం  గోవర్ధన్, సింగోటం శివ, రాజు సాగర్  తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State