బదిలీ ఫై వెళ్లిన ఉద్యోగులకు వీడ్కోలు
పురపాలక సంఘము సూర్యాపేట నందు విధులు నిర్వహిస్తూ బదిలీ ఫై వెళ్లుచున్న మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్, కార్యాలయ అధికారులు,సిబ్బంది వీడ్కోలు పలికారు. మున్సిపల్ రెవిన్యూ అధికారి జానేశ్వరి ,సీనియర్ అకౌంటెంట్ గజ్జి శ్రవణ్ కుమార్ లు మిర్యాల గూడెం మున్సిపాల్టీకి, సీనియర్ అస్సిటెంట్ గడుసు శివ రామ్ రెడ్డి భువనగిరి మున్సిపాల్టీకి, సీనియర్ అస్సిటెంట్ సక్కుబాయి,సంగు మాధవి ,జూనియర్ అస్సిటెంట్ యమ్.డీ.గౌసుద్దీన్,సారగండ్ల శ్రీనివాస్,కె.లలిత,బిల్ కలెక్టర్ శాంతమ్మ ,అటెండర్లు పిడమర్తి ప్రసాద్,వసంత లు కోదాడ మున్సిపాల్టీకి ,జూనియర్ అస్సిటెంట్ అజీముద్దీన్ తిరుమల గిరి మున్సిపాల్టీకి బదిలీ అయ్యారు..
ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగి అన్న ప్పుడు బదిలీలు,రిటైర్డ్ మెంట్ లూ సహజమని,పై సిబ్బంది సూర్యాపేట మున్సిపాల్టీ లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చారు అన్నారు. ఈ కార్యక్రమంలో డీ.ఈ.సత్యారావు,ఏ.ఈ సుమంత్,ఎస్.ఎస్ .ఆర్ .ప్రసాద్,ప్రభుకుమార్ ,ఇండ్ల మనోజ్,బూర సతీష్ తదితరులు పాల్గొన్నారు