విఘ్నాలు తొలగించే వినాయకుడి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలి
సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి అవసరం మానసిక ప్రశాంతత లభిస్తుంది
సకల దేవతల గణాలకు అధిపతి వినాయకుడు
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్
(సూర్యాపేట టౌన్ సెప్టెంబర్ 13) సమాజంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి అవసరమని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఈరోజు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మన్యం సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర పదో వార్డు వెంకటేశ్వర కాలనీ ఏరియాలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్ద తన కుటుంబ సభ్యులతో కలసి కాలనీ ప్రజలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం మూలంగా ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడి చల్లని చూపుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విఘ్నాలు తొలగి విజయాలు చేకూరాలని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు.
సమాజంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి కార్యములో పండుగలలో పూజ చేసేటప్పుడు మొట్టమొదటిగా వినాయకుడికే విఘ్నాలు తొలగిపోవాలని పూజలు చేస్తాం అని ఆయన అన్నారు. తెలంగాణలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వినాయకుని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలవరపు కామేశ్వరరావు పొన్నం వెంకటేశ్వర్లు పెద్ది రామచంద్రరావు కణతల వెంకటేశ్వర్లు గడ్డం వెంకట్ రెడ్డి షాదు వెంకటరెడ్డి మన్యం సదాశివరెడ్డి సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సురేందర్ రెడ్డి రిటైర్డ్ టీచరు రామచంద్రయ్య గారు తదితరులు పాల్గొన్నారు.