వికలాంగులకు సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలి
వికలాంగులకు ఎన్నికలో నామినేట్ పోస్టులు అమలు చేయాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
మోత్కూరు 9 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల హెడ్ కోటర్ లో ఎన్.పి.ఆర్.డి టౌన్ కమిటీ సమావేశంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేంద్ర మాట్లాడుతూ..గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వికలాంగులకు సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పి ఇప్పటికీ శిశు సంక్షేమ శాఖ లోనే కొనసాగిస్తురు వికలాంగులకు ఎంత బడ్జెట్ అనేది తెలియక ఇప్పటికే అర్థమయ్యే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యేక వికలాంగుల సంక్షేమ శాఖ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం గతంలో ఉన్న పెన్షన్ బకాయి పడ్డ డబ్బులు వెంటనే అమలు చేయాలి వికలాంగులకు పరికరాలు ఇస్తామని ఇప్పటికీ మూడు దఫాలో అప్లికేషన్ పెట్టుకున్నా ఏ ఒక్కరికి కూడా బడ్జెట్ లేదని పరికరాలు పంపించేసి పరిస్థితి లేదు వెంటనే ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న . వికలాంగులకు ఉపాధి అవకాశాల్లో రుణాలు ఇస్తామని ఇప్పటికీ బ్యాంకు ద్వారా ఏ మాత్రం రుణం ఇచ్చే పరిస్థితి లేదు వెంటనే ప్రతి వికలాంగునికి ఎలాంటి చర్తులు లేకుండా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 10 లక్షల రూపాయలు రుణం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం వికలాంగులకు ఎన్నికల్లో ముందు హామీ ఇచ్చిన ఇప్పటికీ 27నెలలు గడిచిన 6వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పటికి మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని 6వేల రూపాయలు పెన్షన్ వెంటనే ఇవ్వాలని వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని వికలాంగులకు అంతో దయ రేషన్ కార్డు 35కిలోల బియ్యం వెంటనే ఇవ్వాలని వికలాంగులకు ఎన్నికలలో అవకాశం కొరకు నామినేటెడ్ పోస్టులు చేయాలని గ్రామపంచాయతీ నుంచి అసెంబ్లీ పార్లమెంట్ వరకు నామినేట్ పోస్ట్లు అమలు చేయాలని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీల్లో వికలాంగుల సమస్యలు పరిష్కారం అమలు చేస్తారని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి ఎన్ పి ఆర్ డి డివిజన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి ఎన్ పి ఆర్ డి మోత్కూరు మండల అధ్యక్షులు ఎర్రవెల్లి నాగేష్ టౌన్ అధ్యక్షులు గౌలికర్ రాజు మోత్కూరు మున్సిపాలిటీ అధ్యక్షులు, గుండు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి,అప్పల యాదగిరి ,వెంకటేష్, మోత్కూర్ మహిళా కన్వినర్ మంజుల, గొడిశాల యాదగిరి, చేతరాశి రమేష్ జయభిక్షం ఎండి జమాల్ ఎస్.కె కాశీం తదితరులు పాల్గొన్నారు.