వేసవిలో పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు గేదల కొమ్ములకు రెడ్ రేడియం స్టికర్స్.

మునగాల పోలీస్ వినూత్న ఆలోచన.

Apr 9, 2026 - 18:46
Apr 9, 2026 - 18:47
 0  2
వేసవిలో పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు గేదల కొమ్ములకు రెడ్ రేడియం స్టికర్స్.

మునగాల పోలీస్ వినూత్న ఆలోచన.

వేసవిలో పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు గేదల కొమ్ములకు రెడ్ రేడియం స్టికర్స్.

జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామం ముకుందాపురంలో కార్యచరణ.

మునగాల  9 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– మునగాల మండల పరిధి జాతీయ రహదారి 65 పై వేసవికాలంలో పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా మునగాల మండల పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మునగాల మండల పరిధి జాతీయ రహదారి 65 పై ప్రతి వేసవికాలంలో రాత్రిళ్ళు అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి పశువులు, ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని దీనిని నివారించడం కోసం మునగాల పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశించారు. 

దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకొని మునగాల మండల పోలీసులు ఈరోజు ముకుందాపురం గ్రామంలో గేదెలకు రెడ్ రేడియం స్టిక్కర్లు అందించడం జరిగింది ఈ రెడ్ రేడియం స్టిక్కర్లు  వల్ల రాత్రిళ్ళు వాహనదారులకు పశువులు కనిపించి ప్రమాదాలను తప్పించవచ్చని మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి రాములమ్మ, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్, జాతీయ రహదారుల అధికారి ఫనీంద్ర, మునగాల పశువు వైద్యాధికారి భాస్కర్, హరిత, నరసింహారావు, గోపాలమిత్ర నాగరాజు సైదులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333