వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
అడ్డగూడూరు 9 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ళరామారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.రైతులు దళారుల చెప్పే మాయ మాటలకు రైతులు మోసపోద్దని అన్నారు.రైతులు పండించిన వడ్ల ధాన్యానికి ఏ గ్రేడ్ ఒక కింటాకి 2389 కామన్ వడ్ల ధాన్యానికి 2369 రూపాయల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.రైతులు వడ్ల మార్కెట్లో పనులు చేసుకునే సమయంలో ఎండలు విపరీతంగా కొట్టడం వల్ల నీరసం రాకుండా ప్రభుత్వం దాహం కోసం ఓ.ఆర్.ఎస్ రైతులకు అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పిడి నాగిరెడ్డి,తాసిల్దార్ శేషగిరిరావు,ఎంపీడీవో శంకరయ్య,ఏవో పాండురంగ చారి,ఏపిఎం కళావతి, అక్షర ఆర్ఐ ఉపేందర్,అడ్డగూడూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి, మోత్కూర్ మార్కెట్ డైరెక్టర్ బాలెoల విద్యాసాగర్ మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, చౌళ్ళరామారం గ్రామ సర్పంచ్ మందుల రేణుక కిరణ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, కోటమర్తి గ్రామ సర్పంచ్ పాశం విష్ణువర్ధన్ రావు,అడ్డగూడూరు గ్రామ సర్పంచ్ పూజారి వనజ సైదులు, ధర్మారం గ్రామ ఉపసర్పంచ్ కత్తుల నరేష్,రేపాక గ్రామ సర్పంచ్ ముక్కామల శ్రీకాంత్,తమ తమ గ్రామాలలో ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం వడ్ల కొనుగోలు కేంద్రాలను సర్పంచ్లు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు, రైతులు, మండల నాయకులు కడారి రమేష్, బైరెడ్డి సందీప్ రెడ్డి, మందుల సోమన్న, బాలేoల సురేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.