వాహన తనిఖీ నిర్వహిస్తున్న మండల ఎస్సై శ్రీనివాస్ రావు
కేటీ దొడ్డి:- కేటి దొడ్డి మండల పరిధిలోని నందిన్నె చెక్పోస్ట్ దగ్గర శనివారం సాయంత్రం సరిహద్దు ప్రాంతం నుండి వచ్చి పోయే వాహనాల్లో రవాణా చేస్తున్న సామాగ్రిని క్షుణ్ణంగా మరియు మోటార్ వెహికల్ తనిఖీ నిర్వహించిన స్థానిక మండల ఎస్సై శ్రీనివాస్ రావు.ఈసందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. వాహన చోదకులు ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వాహనానికి సంబంధించిన పత్రాలు వారి వెంట ఉంచుకోవాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి అపరాధ రుసుము విధించారు.ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు. వాహన దారులు మధ్యం తాగి వాహనాలు నడపకూడదని వాహనదారులకు హెచ్చరించారు. వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని వాహనదారులకు తెలిపారు. ఎస్సై వెంట పోలీస్ సిబంది విజయ్, మహేష్ పాల్గొన్నారు.