వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లు జరిగే సేవలు అభినందించిన హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు :- వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ గారి అధ్యక్షతన హైదరాబాద్ కార్ఖానా సికింద్రాబాద్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆఫీసులో విశ్వా వసు నామ సంవత్సర తెలుగు పంచాంగం హర్యానా గవర్నర్ గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేలకొండపల్లి పట్టణ ఆర్య సంఘం అధ్యక్షులు రే గూరి హనుమంతరావు మరియు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వాసవి క్లబ్స్ గవర్నర్స్ నెలకొండపల్లి 202O అధ్యక్షులు కొత్త క్రాంతి కిరణ్ పాల్గొన్నారు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ బహుశా ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయని పంచాంగం అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలియచేసేగణిత శాస్త్రం ఉగాది విశ్వా వసునూతన సంవత్సరమునకు పంచాంగం ఆవిష్కరించటం సంతోషంగా ఉన్నదని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో జరిగే సేవలు గణనీయమని కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా సేవ చేయటం గొప్ప విషయమని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చేస్తున్నటువంటి సేవలు అభినందించారు ఈరోజు వారి చేతుల మీదుగా తక్షణ సహాయం రక్షణ కవచం నిరుపేదలైన ఆర్యవైశ్యులు హెల్త్ పరంగా గాని నిరుపేద ఆర్యవైశ్య కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారికి వెంటనే ఒక గంటలోపు 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమము తక్షణ సేవ రక్షణ కవచం ఇలాంటి ప్రోగ్రామును నా చేతులతో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉన్నదని ఈ టైటిల్ పేరు కూడా చాలా చక్కగా ఉన్నదని అభినందించారు వాసవి క్లబ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు వారి క్యాబినెట్ మరియు డిస్టిక్ ఆఫీసర్స్ రే గూరి వాసవి , దోసపాటి చంద్రశేఖర్, తెల్లాకుల జయశ్రీ, గ్రేటర్ నెలకొండపల్లి అధ్యక్షులు డాక్టర్ నాగబండి శ్రీనివాసరావు పలువురు అభినందనలు తెలియజేశారు