యూరియా యాప్ వీడియో కాన్ఫరెన్స్ అవగాహన సదస్సు
అడ్డగూడూరు 18 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో యూరియా యాప్ గురించి అవగాహన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సు నిర్వహించారు.ఈనెల 20వ తేదీ నుండి రైతులు యూరియా కొనుగోలు చేయాలంటే మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి దీనిలో భాగంగా వ్యవసాయ సంభోకుడు డాక్టర్"వి గోపి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అందరూ వ్యవసాయ అధికారులకి మరియు ఎరువుల డీలర్స్ కి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.గురువారం రోజు అడ్డగూడూరు రైతు వేదిక నుండి వ్యవసాయ అధికారి పాండురంగచారి,మరియు వ్యవసాయ ఏవో అధికారులు,మండలంలోని ఎరువుల దుకాణాల యజమానులు ఈ వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొని వీక్షించారు.