పి వి సి సత్యనారాయణపురం లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శ్రామిక

Dec 4, 2024 - 21:40
Dec 5, 2024 - 13:35
 0  3
పి వి సి సత్యనారాయణపురం లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శ్రామిక

సొంత మండలంలో ఉద్యోగం చేయడం అదృష్టంగా భావిస్తున్నా :డాక్టర్ జాడి. శ్రామిక MV sc(V&AH)వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 

చర్ల, డిసెంబర్ 04, : చర్ల మండల కేంద్రంలోని విజయ కాలనీకి చెందిన జాడి లక్ష్మినారాయణ శ్రీమతి భానుమతి ల రెండవ కుమార్తె జాడి శ్రామిక ఆరవ తరగతి వరకు చర్లలోని ప్రముఖ పాఠశాలలో విద్యనభ్యశించారు. చదువుతో పాటు డ్యాన్స్ లో కూడా ప్రావిన్యత కలిగి ఉన్నారు. ఆరవ తరగతిలోనే నాన్ స్టాప్ గా పదమూడు గంటలు డ్యాన్స్ చేసి లింక్కా బుక్ అఫ్ రికార్డ్ లో స్థానం పొందారు.పదవ తరగతిలో 516మార్కులు, ఇంటర్మీడియట్ లో 900పైగా మార్కులు సాధించారు. చిన్నతనం నుండే చదువులోనూ, డ్యాన్స్ లోను ఎంతో చురుకుగా ఉండేవారు. తన తండ్రి జాడి లక్ష్మి నారాయణ వైద్యులుగా చర్ల మండల ప్రజలకు సుపరిచితులు.తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి చదివి మండలంలోని పి వి సి సత్యనారాయణపురం నందు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గా ఉద్యోగం పొందారు.మొదటి నియామకం సొంత మండలంలో రావడం అదృష్టం గా భావిస్తున్నానని డాక్టర్ శ్రామిక ఆనందం వ్యక్తం చేశారు.ఎంతో కష్టపడి చదివిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.