వరంగల్ టికెట్ తీసుకుని హనుమకొండ బస్టాండ్ వరకు ప్రయాణించిన మహిళ
సూర్యాపేట నుండి హనుమకొండకు ఎలక్ట్రికల్ బస్సు TG 29T5611 సర్వీసులో తొర్రూరులో బస్సు ఎక్కిన మహిళ వరంగల్ కు టికెట్ తీసుకుని హనుమకొండ వరకు ఉచితంగా ప్రయాణించింది హనుమకొండ బస్టాండ్లో టికెట్ చెకింగ్ ఆఫీసర్ సుధాకర్ టికెట్ చెకింగ్ చేస్తుండగా ఈ విషయం తెలిసింది తప్పు చేసిన కూడా ఆ మహిళ దబాయించడం చర్చనీయాంశంగా మారింది చివరగా సదురు అధికారి 100 రూపాయలు జరిమానా వేయడంతో రుసుము చెల్లించి తమ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళింది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం దుర్వినియోగం అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు